Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 11:02:33
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సినిమా అన్న నాటి నుంచి ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. పూరి జగన్నాథ్ గత రెండేళ్లలో నాలుగు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసినప్పటికీ.. ఈ సినిమా మీద మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. ఇందుకు కాంబినేషన్ క్రేజే కారణం. బాలయ్యతో పూరి ఎలాంటి సినిమా తీస్తాడు.. ఇందులో హైలైట్లేముంటాయ్.. అని నందమూరి అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి దీని విశేషాలేంటన్నది బయటికి రాలేదు. ఐతే ఇప్పుడు బాలయ్యే ఇందులోని హైలైట్ల గురించి మాట్లాడాడు. ఈ సినిమాకు అనూప్ అందిస్తున్న మ్యూజిక్ గురించి కూడా మీడియాతో పంచుకున్నాడు. ఇంతకీ పైసా వసూల్ గురించి బాలయ్య ఏమన్నాడంటే..

పూరి జగన్నాథ్.. నేను ఒకటే టైపు. ఇద్దరం బాగా కలిసిపోయాం. ఆయన క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆర్టిస్టులను చక్కగా ఉపయోగించుకుంటూ చకచకా షూటింగ్ చేస్తారు. మా తొలి కాంబినేషన్ మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. వాటన్నిటినీ మించేలా ఈ సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. ఒక సినిమా ఎలా ఉండబోతోందన్నది షూటింగ్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ కావచ్చు. పైసా వసూల్ విషయంలో అదే జరుగుతోంది. పూరి రాసిన పంచ్ డైలాగులు అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఉంటాయి. ఈ సినిమాలో కథలో.. హీరో క్యారెక్టరైజేషన్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆడియో గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అనూప్ అద్భుతమైన బాణీలిచ్చాడు. నాన్న గారు నటించిన పాపులర్ మూవీ జీవితచక్రంలోని కంటి చూపు చెబుతోంది... కొంటె నవ్వు చెబుతోంది... మూగమనసులో మాట ఓ పిల్లా... అనే పాటను రీమేక్స్ చేశాం. ఆ పాటను అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే నేను తొలిసారిగా ఓ పాట పాడా.

,  ,  ,  ,  ,