Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 11:19:30
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోల పిల్లలపై నిరంతరం మీడియా.. జనాల కళ్లు నిలిచే ఉంటాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ పిల్లలంటే ఇంకా ఆసక్తి ఎక్కువుంటుంది. కానీ పవన్ పిల్లలు అకీరానందన్.. ఆద్య మాత్రం మన మీడియాకు.. జనాలకు చిక్కకుండా లో ప్రొఫైల్ లైఫ్ గడుపుతున్నారు. ఎప్పుడో ఏడాదికోసారి వాళ్ల ఫొటోలు మీడియాలో దర్శనమిస్తే ఎక్కువ. పవన్ తో విడిపోయాక పిల్లల్ని తీసుకుని పుణెకు వెళ్లిపోయిన రేణు దేశాయ్.. వాళ్లను అక్కడే పెంచి పెద్ద చేస్తోంది. అప్పుడప్పుడూ ఏవైనా వేడుకలు జరిగినపుడు వాళ్ల ఫొటోలు షేర్ చేస్తోంది. ఎప్పుడో ఒకసారి వాళ్ల ఫొటోలు చూడ్డం వల్ల ఒకసారికి.. ఇంకోసారికి చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

తాజాగా దీపావళి వేడుకల సందర్భంగా అకీరా.. ఆద్యల ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది రేణు దేశాయ్. అకీరా టీనేజీలోకి అడుగుపెట్టేసిన సంగతి ఈ ఫొటోలు చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. ఇక పవన్ కూతురైతే భలే చిత్రంగా ఉంది. అప్పుడెప్పుడో చిన్న వయసులో స్కూల్లో ఓ వేడుక సందర్భంగా తీసిన ఫొటో చూశాక ఇప్పుడు మళ్లీ ఆద్య ఫొటో బయటికి రావడం ఇదే. అప్పటికి.. ఇప్పటికీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అచ్చం పవన్ లాగే నవ్వుతూ తండ్రిని గుర్తుకు తెస్తోంది ఆద్య. ఈ ఫొటోలు చూసిన పవన్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు. ప్రస్తుతం బుద్ధిగా చదువుకుంటున్న అకీరా.. భవిష్యత్తులో సినీ రంగ ప్రవేశం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాల్యమంతా పుణెలోనే గడుస్తున్నప్పటికీ అకీరాకు తెలుగు బాగా వచ్చని రేణు చెప్పిన సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,