Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Oct-2015 16:48:23
facebook Twitter Googleplus
Photo

అదేంటీ.. వర్మకు బ్రూస్ లీకి సంబంధం ఏంటి? మూవీ రిలీజ్ రోజున సాంగ్ విడుదల చేయడమేంటి ? అనిపిస్తోంది కదూ. దటీజ్ రామ్ గోపాల్ వర్మ. దేన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో... వర్మకు బాగా తెలుసు. సిట్యుయేషన్ ని తనకు అనుకూలంగా మలుచుకోవడం వర్మకు మాస్టర్ డిగ్రీకి మించనది ఏదైనా ఇవ్వాలి. అలా ఉంటాయి ఈయన గారి యాక్టివిటీస్.

టాలీవుడ్ అంతా రామ్ చరణ్ బ్రూస్ లీ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న సమయంలో... తనో లేడీ బ్రూస్ లీని తీస్తున్నట్లు చెప్పి ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ ఇచ్చాడు. జనాల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడెప్పుడే ఏళ్ల క్రితం మొదలుపెట్టిన మూవీ ఇది. దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నానని త్వరలో తెరపైకి తెస్తున్నట్లుగా తెలియచేశాడు. కరెక్ట్ గా మెగా కేమియోతో సూపర్బ్ హైప్ వచ్చి.. బ్రూస్ లీ విడుదలపై జనాలు మాట్లాడుకుంటున్న టైంలో.. ఇదిగో బ్రూస్ లీ సాంగ్ అంటూ.. ఓ పాటను రిలీజ్ చేశాడు. దమ్ముంది - తెగింపు ఉంది. ఇంకా నీకు ఏంకావాలి.. అంటూ ఓ భామ వయ్యారాలు చూపించుకుంటూ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది.

జనాల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి వర్మ చేస్తున్న కుట్ర ఇదంతా మెగా ఫ్యాన్స్ మండిపోతున్నారు. అయినా సరే ఏ మాత్రం తగ్గని వర్మ.. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల కాన్సెప్ట్ తో వస్తున్న తొలి ఇండియన్ లేడీ ఓరియెంట్ మూవీ ఇదే అని ప్రమోట్ చేసేసుకుంటున్నాడు. దటీజ్ వర్మ. పబ్లిసిటీకి కాదేదీ అనర్హం. బాంబు పేలుళ్లైనా.. బ్రూస్ లీ అయినా.. వర్మ ఒకే యాంగిల్ లో చూస్తాడు కదా.

,  ,  ,