Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2017 13:42:41
facebook Twitter Googleplus
Photo

1995లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమా రంగీలా అప్పట్లో ఆ సినిమాను చూసి అందరూ అవాక్కైపోయారు. ఒక్కసారిగా రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో సూపర్ హిట్ డైరక్టర్ అయిపోయాడు. అదే విధంగా హీరోయిన్ ఊర్మిళా మటోండ్కర్ ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఇక ఫ్లాపులతో సావాసం చేస్తున్న అమీర్ ఖాన్ కు కూడా కెరియర్ టర్న్ అయిపోయింది. అంతేకాదండోయ్.. అసలు బాలీవుడ్ లో ఏ.ఆర్.రెహ్మాన్ తన పంజాను గట్టిగా విసరడం మొదలెట్టింది ఆ సినిమా నుండే. ఇంతకీ ఈ రంగీలా పిల్లకు ఇప్పుడు సీక్వెల్ వస్తోందా రావట్లేదా?

అసలు నాకు సీక్వెల్ తీయాలి అనే ఆలోచన కూడా తట్టలేదు.ఇప్పటికైతే నేను రంగీలా సినిమాకు ఎటువంటి సీక్వెల్ ను చేయట్లేదు'' అంటూ సెలవిచ్చాడు రామ్ గోపాల్ వర్మ. మనోడు ఇలా చెబుతాడు కాని.. చేయనన్న పనినే చేస్తుంటాడు. గతంలో తాను తీసిన శివకు శివ 2006 అంటూ ఒక సీక్వెల్ తీశాడు. అలాగే సర్కార్ సినిమాకు సీక్వెల్స్ తీస్తూనే ఉన్నాడు. అప్పట్లో డర్నా సినిమాలకు అనే సీక్వెళ్ళను ప్రొడ్యూస్ చేశాడు కూడా. ఇప్పుడు అందుకే మనోడు రంగీళా సీక్వెల్ తీయట్లేదు అంటే అంత నమ్మశక్యంగా లేదు.

,  ,  ,  ,  ,