Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2017 11:20:54
facebook Twitter Googleplus
Photo

వోడ్కా మానేశాంటూ ఆల్రెడీ సినీ లోకాన్ని తీవ్రమైన విషాదానికి గురి చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో మారు తన ఇంటెలిజెంట్ ట్వీట్లతో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. తాజాగా రిలీజైన స్పైడర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేసిన వర్మ.. ఒక ఇంట్రెస్టింగ్ మాటన్నాడు. అందులో ఎంతవరకు నిజముందో సెటైరుందో తెలియకు ఇప్పుడు ఫ్యాన్స్ కు తలనొప్పి వస్తోందనుకోండి.

సింప్లీ ఎమేజింగ్. మహేష్ బాబు దేవుడిలా కనిపిస్తున్నాడు అంటూ ఒక పోస్టర్ ను ట్వీటేశాడు రామ్ గోపాల్ వర్మ. విషయం ఏంటంటే.. మనోడు ఈ ట్వీటేసేనాటికే.. ఆల్రెడీ 1-నేనొక్కడినే.. శ్రీమంతుడు సినిమా పోస్టర్ ను చూసినట్లుంది అంటూ సదరు పోస్టర్ పై మిశ్రమ స్పందన వచ్చేసింది. అప్పుడు కొంచెం సన్నగా ఉన్న మహేష్ ఇప్పుడు కాస్త ఒళ్ళు చేశాడని.. మిగిలినదంతా సేమ్ టు సేమ్ అంటూ టాక్ వస్తున్న వేళ.. రామ్ గోపాల్ వర్మ ఇలా దేవుడు అంటూ ట్వీటేయడం అందరినీ కాస్త షాక్ కు గురిచేస్తుందంతే.

అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం.. చక్కగా ఒక సింపుల్ ట్వీటేసి.. క్రింద సినిమా లవర్స్ అందరూ అవాకులు చివాకులు పేల్చుకుంటూ ఉంటుంటే.. వాటిని చదువుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండుంటాడు. మరి వోడ్కా నిజంగానే మానేశాడేమో తెలియదు కాని.. ఇప్పటివరకు ఈ పోస్టర్ కు కంటిన్యూషన్ ట్వీట్లు మాత్రం వేయలేదు

,  ,  ,  ,  ,  ,