Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 10:13:17
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ కాలేజీ రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఆయన రాసిన నా ఇష్టం పుస్తకంలో దీనికి సంబంధించిన విశేషాలు చాలా ఉంటాయి. తాను ఎవ్వరినీ కొట్టకున్నా.. కొట్టగలను అనే ఫీలింగ్ కలిగించినట్లు చెబుతాడు వర్మ అందులో. ఆ పుస్తకంలో వర్మ కరాటే పోజులతో ఉన్న ఫొటోలు కూడా భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ఫొటోల్ని తాజాగా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు వర్మ. ఐతే కేవలం వర్మ ఫొటోలే ఉంటే అందులో విశేషమేమీ లేదు. నేను.. అతను అంటూ మరో వ్యక్తి కరాటే పోజులకు సంబంధించిన ఫొటోలు కూడా పంచుకున్నాడు వర్మ.

ఆ మరో వ్యక్తి మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కూడా కుర్రాడిగా ఉన్నపుడు మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సంపాదించిన సంగతి తెలిసిందే. అతడికి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. తన సినిమాల్లో ఎన్నోసార్లు మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల్ని కూడా ప్రదర్శించాడు పవన్. పవన్ కరాటేలో ఎంత పవర్ ఫులో వర్మ షేర్ చేసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాలును నిటారుగా పైకి లేపాడు పవన్. కొంత కాలంగా పవన్ ప్రస్తావన లేకుండా ట్వీట్లు చేస్తూ వస్తున్న వర్మ.. మళ్లీ పవర్ స్టార్ మీదికి దృష్టి మళ్లించినట్లున్నాడు ఈ ఫొటోలు చూస్తుంటే. ఏదేమైనా ఈ ఫొటోలు జనాలకు మంచి ఫీలింగ్ అయితే ఇచ్చాయి.

,  ,  ,  ,  ,