Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Sep-2016 11:56:04
facebook Twitter Googleplus
Photo

పెళ్లిచూపులు మూవీతో సక్సెస్ ని మాత్రమే కాదు.. బోలెడంత క్రేజ్ కూడా సంపాదించేసింది రీతు వర్మ. సినిమాల వరకే కాకుండా.. అమ్మడి గురించి మాట్లాడుకోవడానికి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. అదే రీతు వర్మ స్టైలింగ్ అండ్ డ్రసింగ్. అసలు స్టైల్ అనేది ఎవరికి వాళ్లకు ప్రత్యేకమని.. ఆయా వ్యక్తుల పర్సనాలిటీని ఇండికేట్ చేస్తాయని.. అందుకే వాటిపై బాగా శ్రద్ధపెడతానని చెబుతోంది రీతు.

'రెగ్యులర్ గా అయితే కంఫర్ట్ కోసం జీన్స్-టీషర్ట్ లాంటి కేజువల్స్ వేసుకుంటాను. కానీ స్పెషల్ అకేషన్స్ కి స్పెషల్ గా డ్రసింగ్ చేసుకోవడం బాగా ఇష్టం. ఏదైనా సరే ఆ టైంకి నా మూడ్ ప్రకారమే ఉంటుంది. నేను బ్రాండ్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నాకు నచ్చే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కానీ.. రోడ్డు పక్కన షాపింగ్ చేయడాన్ని ఇష్టపడతా. నా వార్డ్ రోబ్ లో జీన్స్ నుంచి అన్ని రకాలు ఉంటాయి. ఇక యాక్సెసరీస్ విషయానికి వస్తే.. వాచెస్ బాగా ఇష్టపడతా' అని చెబుతోంది రీతు.

ఇక డేట్ కి వెళ్లాల్సి వస్తే బాగా కంఫర్ట్ డ్రసింగ్ నే ప్రిఫర్ చేస్తుంతట. ఉదయాన్నే ఫ్లోరల్ అయితే బాగుంటుందని రీతు చెబుతోంది. రోజుకు 3-4 సార్లు వర్కవుట్ చేస్తానని.. ఫుడ్ విషయంలో బాగా స్ట్రిక్ట్ గా ఉంటానని.. బ్యూటీ సీక్రెట్స్ కూడా విప్పేసింది రీతు వర్మ.

,  ,  ,  ,  ,  ,