Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2015 12:10:07
facebook Twitter Googleplus
Photo

గతంలో వచ్చిన 'రోబో' చిత్రానికి సీక్వెల్ తీయాలని దర్శకుడు శంకర్ గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. దీంతో ఇందులో నటించే ఆర్టిస్టుల గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. రజనీకాంత్ చేయడనీ, అజిత్ చేస్తాడనీ...ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజా వార్త ఏమిటంటే, ఈ 'రోబో 2'లో రజనీకాంత్, అమీర్ ఖాన్ కలసి నటిస్తారట! ఇందుకు సంబంధించిన సబ్జెక్టును రూపొందించే పనిలో శంకర్ బిజీగా ఉన్నాడనీ, వారు కూడా చేయడానికి ఉత్సాహం చూపుతున్నారనీ అంటున్నారు. అయితే, ఎటొచ్చీ బడ్జెట్టే పెద్ద అడ్డంకిగా మారింది. చిత్ర నిర్మాణానికే 200 కోట్ల వరకు అవుతుందట. ఇంకా ప్రమోషన్ వంటివి వేసుకుంటే, మరో 50 కోట్లు పడతాయి. ఈ నేపథ్యంలో ఇంత బడ్జెట్టుతో దీనిని ఎవరు నిర్మిస్తారన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే!

,  ,  ,  ,