Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Aug-2017 10:33:30
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్లు అంతే.. వారు ఇండస్ర్టీకి వచ్చినప్పుడు చేసిన తొలి సినిమాలు పెద్దగా ఆడకపోయినా.. వాటికి అంత క్రేజ్ రాకపోయినా కూడా.. వాళ్లకు మాత్రం మాంచి ఆఫర్లే వస్తుంటాయి. ఇప్పటి స్టార్ హీరోయిన్లు అయిన కాజల్ అగర్వాల్.. రకుల్ ప్రీత్ లు తొలి సినిమాలతో ఫ్లాపులే కొట్టారు. కాకపోతే వీరి అందచందాలూ యాక్టింగూ బాగుండటంతో ఆఫర్లు పట్టేశారు. ఇప్పుడు మరో కొత్త పిల్ల కూడా అదే చేస్తోంది.

అప్పుడెప్పుడో ఆకతాయి అనే తెలుగు సినిమాలో నటించిన ముంబయ్ పిల్ల రుక్సార్ మీర్.. ఆ తరువాత రాజమౌళి తమ్ముడు డైరక్ట్ చేసిన షో టైమ్ లో నటించింది. మొదటి సినిమా ఎప్పుడు రిలీజైందో తెలియదు.. రెండో సినిమా ఇంకా రిలీజవ్వలేదు.. కాని కన్నడలో చాలా సినిమాలు చేస్తున్న ఈ పిల్ల ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. ఎప్పటినుండో చిన్న సినిమా ఆఫర్లు చాలా వస్తున్నా కూడా వాటిని ఒప్పుకోకుండా ఇప్పుడు పెద్ద ఆఫరే పట్టింది. నాని హీరోగా డబుల్ యాక్షన్లో మేర్లపాక గాంధి డైరక్షన్లో వస్తున్న కృష్ణార్జున యుద్దం సినిమాలో హీరోయిన్ గా దాదాపు ఓకె అయ్యిందట. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఒక స్టార్ నటి చేస్తుందట. అది సంగతి.

,  ,  ,  ,  ,