Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2016 12:04:22
facebook Twitter Googleplus
Photo

అందరూ బాలూ అని పిలుచుకొనే బాలసుబ్రహ్మణ్యం గురించి తెలియని భారతీయుడు ఉండరు. తెలుగు - తమిళం - కన్నడ - హిందీ - మలయాళం భాషల్లో 40వేలకు పైగా పాటలుపాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందారు. అందుకే ఆయన్ను గాన గంధర్వుడు అంటారు. ఇప్పుడు ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఆయన్ను మరో ఘనతతో సత్కరించనుంది.

2016కిగాను సెంటినరీ అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇప్పుడు బాలూకు అందించనున్నారు. త్వరలో గోవాలో జరగనున్న భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) ఉత్సవాల్లో దీన్ని ప్రదానం చేస్తారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ఢిల్లీలో ఈ విషయం ప్రకటించారు. గతంలో వహీదా రెహమాన్ - రజనీకాంత్ మరియు ఇళయరాజాలు ఈ అవార్డును పొందరు. వారి తరువాత ఇప్పుడు బాలూ అందుకోనున్నారు. నాలుగు భాషల నుంచి జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు. లెక్కలేనన్ని రాష్ట్రస్థాయి అవార్డులు స్వీకరించిన బాలూకు.. 2001లో పద్మశ్రీ - 2011లో పద్మభూషణ్ కూడా ఇచ్చింది భారత ప్రభుత్వం.

ఏదేమైనా కూడా ఒక తెలుగు వాడికి ఈ అవార్డు రావడం ఆనేది యావత్తు తెలుగు జాతికే గర్వకారణం.

,  ,  ,  ,  ,