Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Feb-2017 11:55:16
facebook Twitter Googleplus
Photo

గత వారం రిలీజ్ అయిన నాని మూవీ నేను లోకల్ అంచనాలకు మించి ఆడేస్తోంది. సాధారణంగా ఏ సెంటర్లలో నాని సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ నేను లోకల్ లో మాస్ టచ్ కూడా ఉండడంతో బీ సీ సెంటర్లలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. అందుకే నాని కెరీర్ బెస్ట్ గా నిలిచిందీ చిత్రం. మరోవైపు ఈ శుక్రవారం నాగార్జున మూవీ ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కానుంది. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు చాలానే ఉన్నాయి.

అయితే.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ను కోలీవుడ్ హీరో సూర్య మూవీ ఎస్3 దెబ్బ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇది డబ్బింగ్ సినిమానే అయినా.. అంత తేలికగా తీసేసే విషయం కాదు. యముడు3 అంటూ వస్తున్న ఈ మూవీపై.. తెలుగు రాష్ట్రాల వరకే 18 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రధానంగా బీ సీ సెంటర్లలో ఇలాంటి మాస్ కంటెంట్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. టాక్ కొంచెం బాగున్నాసరే.. విపరీతంగా ఆడేందుకు అవకాశాలుంటాయి.

మరోవైపు నాగ్ మూవీ కంటే ఒక రోజు ముందే సూర్య సినిమా వచ్చేయనుంది. అంటే టాక్ అప్పటికే తెలిసిపోనుంది. మల్టీప్లెక్సులు- ఏ సెంటర్లు ఓకే అనుకున్నా.. బీ సీ సెంటర్లలో మాత్రం నాని.. నాగార్జునలకు సూర్య టెన్షన్ తప్పకపోవచ్చు.

,  ,  ,  ,  ,