Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 10:35:32
facebook Twitter Googleplus
Photo

తెలుగు తెర పై హాట్ జోడీగా ప్రభాస్ - అనుష్క కు మంచి పేరుంది. ఈ మధ్య కాలంలో మరే జంటకు ఇంత క్రేజ్ ఏర్పడలేదు. బాహుబలి సినిమాతో వీళ్ళ కెమిస్త్రీ స్క్రీన్ పై మరింత పెరిగింది. మిర్చి సినిమా వేడుక లో అనుష్క తో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ అని ఒక స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు అప్పటిలో. అన్నట్లు గానే ఇప్పుడు ఆ జంట మరోసారి జతకడతారని టాక్ వినిపిస్తోంది.

బిల్లా సినిమాతో వీళ్ళ సినిమా బంధం మొదలై బాహుబలి తో గట్టిపడి.. ఇప్పుడు సాహో తో హిట్ జోడీగా రికార్డు సృష్టిస్తారా అంటే అవుననే అంటున్నారు ఇన్ సైడర్స్. గత కొన్ని రోజులుగా సాహో సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం చాలమందిని స్క్రీన్ టెస్ట్ చేశారు. పరిణితి చోప్రా - ఆలియా భట్ - సోనప్ కపూర్ - రష్మికా మందన్నా లాంటి చాలా పేర్లు మనం విన్నాం. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తారు కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ అయితే మంచింది అని వాళ్ళు అనుకున్నారు కానీ ఎవ్వరూ సరిగా కుదరలేదు. ఇకపోతే అనుష్క కు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు బాహుబలి ఘనవిజయంతో నార్త్ ప్రేక్షకులుకు కూడా బాగా దగ్గర అయ్యింది. కాబట్టి ఈ సినిమాకు అనుష్క ను హీరోయిన్ గా ఖరారు చేశారని అంటున్నారు.

ఇకపోతే సాహో సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని సెంట్రల్ లైబ్రరీలో గురువారం మొదలైనట్లు సమాచారం. ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ ఉంటుంది అని చెబుతున్నారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది.

,  ,  ,  ,  ,