Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2014 10:43:40
facebook Twitter Googleplus
Photo

ఈమధ్య 'ఆషికి 2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి, భారీ అపజయాన్ని అందుకున్న బాలీవుడ్ నటుడు సచిన్ జోషి ఇప్పుడు మరో చిత్రాన్ని అంగీకరించాడు. ఇన్నాళ్లూ తన సొంత చిత్రాలలోనే నటిస్తూ వచ్చిన ఈ హీరో నటిస్తున్న తొలి బయటి చిత్రమిది. ఆయుష్ రైనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్'. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో సచిన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని గురించి చెబుతూ, "తొలిసారి ఒకరు స్క్రిప్టుతో వచ్చి కీలక పాత్ర పోషించాలని అడగగానే ఆశ్చర్యపోయాను. ఇన్నాళ్లూ నటిస్తూ, నిర్మాణం చూసుకుంటూ బిజీగా వుండేవాణ్ణి. ఈ సినిమా విషయంలో రిలాక్స్ డ్ గా వున్నాను. ఇందులో సూరజ్ వాద్వా అనే పారిశ్రామిక వేత్త పాత్ర పోషిస్తున్నాను" అని చెప్పాడు సచిన్.

,  ,  ,  ,