Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2016 16:25:02
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే ఎంట్రీ ఇచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన సుప్రీమ్ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ గురువారం (మే 5న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) చిరంజీవి గారి బిరుదైన ?సుప్రీమ్? అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఎందుకు పెట్టాలనిపించింది?
స) అది పూర్తిగా దర్శక, నిర్మాతల నిర్ణయమే! సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్ అంశాలతో సాగుతూంటుంది. అదే విధంగా కథ ప్రకారంగా, హీరో క్యారెక్టరైజేషన్ ప్రకారంగా చూసినా ఈ సినిమాకు సుప్రీమ్ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని టీమ్ భావించింది. నేను కూడా స్క్రిప్ట్ విన్నాక అదే పర్ఫెక్ట్ అని ఓకే చెప్పేశా.
ప్రశ్న)సుప్రీమ్ సినిమాకు హైలైట్స్ ఏంటి?
స) సుప్రీమ్ సినిమా 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసున్న వారి వరకూ అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ గురించి చెప్పండి?
స) సుప్రీమ్‌లో నేను ఓ క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నా. ఇతరుల సమస్యలను పరిష్కరించడం కోసం ఎంతదూరమైన వెళ్ళిపోయే ఈ పాత్రలో మంచి ఎనర్జీ ఉంటుంది.
ప్రశ్న) రాశిఖన్నాతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
స) రాశిఖన్నాకు ఈ సినిమాలో అద్భుతమైన రోల్ ఉంది. మా ఇద్దరి కాంబినేషన్‍లో వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలో రాశి చాలా బాగా నటించింది.
ప్రశ్న) దిల్‌రాజుతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేయడం గురించి చెప్పండి?
స) దిల్‌రాజు గారు నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు మొదట్నుంచీ ఈ బ్యానర్ అద్భుతమైన సపోర్ట్ ఇస్తూ మంచి మంచి అవకాశాలను ఇస్తూ వస్తోంది.
ప్రశ్న) దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెప్పండి?
స) ?పటాస్? లాంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఆయనపై చాలా ఒత్తిడి ఉండేది. వాటన్నింటినీ పక్కనబెట్టి కూల్‌గా ఈ సినిమా చేస్తూ పోయారు. ప్రేక్షకుడిని పూర్తిగా కట్టిపడేసే ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా అందించాలో అనిల్ రావిపూడికి సరిగ్గా తెలుసన్నది ఈ సినిమా మరోసారి ఋజువు చేస్తుంది.
ప్రశ్న) చిరంజీవి పాటలను మీ సినిమాల్లో ఎక్కువగా రీమిక్స్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంపై వస్తోన్న కామెంట్స్‌కు ఎలా సమాధానమిస్తారు?
స) అవును.. ఆ కామెంట్స్ నా వరకూ వచ్చాయి. అయితే చిరంజీవి గారి పాటలను రీమిక్స్ చేయడం నేనైతే ఓ గర్వంగా భావిస్తున్నా. లెజెండరీ యాక్టర్‌కు మేమిస్తోన్న ఓ ట్రిబ్యూట్‌గా కూడా దీన్ని భావిస్తున్నాను కాబట్టే, ఎక్కడా ఒరిజినల్ ఫీల్ పోకుండా జాగ్రత్తపడుతున్నా.
ప్రశ్న) ఈ రీమిక్స్ పాటలను పెట్టాల్సిందిగా మీరే కోరుతుంటారా?
స) అస్సల్లేదు. ఒక సినిమాలో ఇది కావాలీ అని అడిగేంత స్థాయి హీరోగా నాకు రాలేదు. నేనేది చేసినా అది దర్శక, నిర్మాతల ఆలోచనే అయి ఉంటుంది తప్ప సినిమా విషయంలో నా సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు.
ప్రశ్న) ఇంతకీ చిరంజీవి ఈ సినిమా చూశారా?
స) ఇంకా లేదు. అన్నీ కుదిరితే రేపు చూస్తారు.
ప్రశ్న) గ్యాంగ్‌లీడర్ పేరుతో ఓ సినిమా చేస్తున్నారని వినిపిస్తోంది. నిజమేనా?
స) లేదు. అది పుకారే! ఇప్పటికి ఆ ఆలోచనే లేదు.
ప్రశ్న) తిక్క సినిమా ఎంతవరకు వచ్చింది?
స) తిక్క దాదాపుగా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మరో పదిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది.

,  ,  ,  ,