Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 12:10:42
facebook Twitter Googleplus
Photo

మెగా సుప్రీం స్టార్ అంటూ ముద్దుగా మెగాభిమానులు పిలుచుకుంటున్న హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ హీరో నటించిన సుప్రీం మూవీ విడుదలకు సిద్దమైపోయింది. మే నెలలో సరైన డేట్ చూసుకుని రిలీజ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేసేశాడు సాయిధరం తేజ్.

కళ్యాణ్ రామ్ ఓమ్ 3డీ చిత్రాన్ని తెరకెక్కించిన సునీల్ రెడ్డి.. తిక్కకి దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు వేగం పుంజుకున్నాయి. కౌలాలంపూర్ - మలేషియాల్లో పిక్చరైజేషన్ పూర్తి చేస్తున్నారు. ఇక లోకల్ గా చిత్రీకరణ అయితే దాదాపు కంప్లీట్ చేసేశారని తెలుస్తోంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు రెండు మూడు పాటలు మినహా.. తిక్క షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయిందని సమాచారం.

తిక్కకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. బ్రెజిల్ భామ లారిస్సా బొనేసి హీరోయిన్ గా నటిస్తోంది. సుప్రీమ్ చిత్రాన్ని రిలీజ్ చేసిన రెండు నెలల్లోపే తిక్కను కూడా తెరపైకి తెచ్చేయనున్నారట. అంటే జూలై - ఆగస్ట్ నెలల్లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,