Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 13:36:01
facebook Twitter Googleplus
Photo

తొలి సినిమా రేయ్ లో ఒకలా కనిపించాడు సాయిధరమ్ తేజ్. ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం లో మరో కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ఆపై సుబ్రమణ్యం ఫర్ సేల్ దగ్గర్నుంచి రెండు మూడు సినిమాల్లో ఒక లుక్ లో కనిపించాడు. ఈ మధ్య విన్నర్ కోసం కూడా కొంచెం అవతారం మార్చాడు. ఐతే ఇప్పుడు జవాన్ కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తున్నాడు.

విన్నర్’ ప్రమోషన్ల తర్వాత తేజు మీడియాలో పెద్దగా కనిపించింది లేదు. సైలెంటుగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో జవాన్ మొదలుపెట్టేశాడు. ఈ సినిమా కోసం అతను అవతారం మార్చేశాడు. హేర్ స్టైల్ తో పాటు మొత్తం ఫేస్ కట్టే మారిపోయింది. ఈ కొత్త లుక్ లోనే తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యాడు తేజు. శాంసంగ్ గెలాక్సీ-8 ఆవిష్కరణ కార్యక్రమంలో అతను తళుక్కుమన్నాడు. అక్కడ తేజును చూసిన వాళ్లందరూ కొంత ఆశ్చర్యపోయారు. లుక్ కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ లుక్ సంగతలా వదిలేస్తే.. సాయిధరమ్ కెరీర్ కు ‘జవాన్’ చాలా కీలకం. తిక్క.. విన్నర్ సినిమాలతో షాకుల మీద షాకులు తిన్నాడు తేజు. ఇంకో ఫ్లాప్ కొడితే బాగా వెనుకబడిపోతాడు. ఈ సినిమా దర్శకుడు బి.వి.ఎస్.రవికి కూడా కీలకమే. తొలి సినిమా వాంటెడ్ దెబ్బకు మళ్లీ చాలా ఏళ్ల పాటు మెగా ఫోన్ పట్టే అవకావం రాలేదతడికి. ఈసారి తనేంటో రుజువు చేసుకోకుంటే దర్శకుడిగా ఇంకో అవకాశం దక్కడం కష్టమే.

,  ,  ,  ,  ,