Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2017 11:38:25
facebook Twitter Googleplus
Photo

సాయి ధరమ్ తేజ్ కు ఇప్పుడు ఇప్పుడే ఒక స్టార్ ఇమేజ్ వస్తుంది. తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న తను ఏమాత్రం అసహనం పడకుండా పని చేస్తూ వెళుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ విడుదలకాబోతున్న సినిమా జవాన్ పై మంచి నమ్మకమే పెట్టుకున్నాడు. మన హీరోలు చాలా వరకు ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా డైరెక్టర్ ఎవరు - ఎవరు నిర్మిస్తున్నారు కథ ఏంటి ఆ కథ నా కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించుకొని సినిమాలు ఓకే చెబుతారు. సాయి ధరమ్ తేజ్ అలా చేయాడంట.. మరేం చేస్తాడో చూడండి

తన సినిమా కథలను ఎన్నుకునే పద్దతిని ఒక మీడియా ఇంటర్వ్యూ ఇలా పంచుకున్నాడు. నేను ఒక సినిమా కు పని చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ డైరెక్టర్ ట్రాక్ రికార్డు ఏమి చూడను. అలా అయితే నేను కూడా చాలా ఫ్లాప్ సినిమాలు చేశాను కదా. నేను ముందు చూసింది ఈ సినిమా ప్రేక్షకులును అలరిస్తుందా లేదా ఈ కథ అవసరం ప్రేక్షకుడుకు ఎంత వరకు ఉంది అని ఆలోచిస్తాను. వాళ్ళ ఆనందం కోసం నేను పని చేయడానికి వచ్చాను అని చెబుతున్నాడు.

ఈ సినిమా డైరెక్టర్ బివి యెస్ రవి కథ చెప్పాడు నాకు బాగా నచ్చింది ఈ సినిమా ద్వారా కొన్ని కుటంబ విషయాలు కొంత మన దేశం భక్తి కి సంబంధించిన విషయాలు చెప్పడానికి మంచి అవకాశం వచ్చింది అందుకనే చేశా అని చెప్పాడు. అంతే కానీ అతని ట్రాక్ రికార్డు చూసి ఓకే చేయలేదు. జవాన్ సినిమాలో యాక్షన్ మనం ఇంతవరకు చూసిన తెలుగు సినిమాలతో పోల్చిచూస్తే ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది అని చెప్పగలను. ఈ సినిమా ద్వారా యాక్షన్ - లవ్ - దేశంపట్ల మన బాధ్యతను అన్నీ కలిపి చెప్పడానికి ఆస్కారం దొరికింది. జవాన్ లో నా పాత్ర కూడా అలానే ఉంటుంది కుటంబమా లేక దేశం అనే మీమాంసలో ఉంటాడు హీరో. ఈ సినిమాలో నేను ఏమి ఆర్మీ ఆఫీసర్ ను కాను కానీ ఈ సినిమా కోసం కొంచెం ఫిట్ గా కనిపించవలిసి వచ్చింది. దాని కోసం కొంచెం బాడీ పెంచాను అని చెప్పాడు. హైదరాబాద్ లో కొన్ని ఫేమస్ ప్లేస్ లలో షూట్ చేశాం.

,  ,  ,  ,  ,