Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2016 11:09:52
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య కాలంలో మనం భారీ ఆడియో లాంచ్ చూసి చాలా రోజులే అయ్యింది. భారీ అంటే ఇక్కడ పెద్ద స్టార్లు అని కాదు.. భారీగా సెలబ్రిటీలు అందరూ హాజరవ్వడం అని. ఈరోజు సాయంత్రం రిలీజవ్వబోయే ''ప్రేమమ్'' ఆడియో లాంచ్ కంటే పెద్ద లాంచ్ ఏముంటుంది? అందుకే అందరూ దాని గురించే డిస్కస్ చేస్తున్నారు.

ముఖ్యంగా గోపిసుందర్ కంపోజ్ చేసిన ఈ నాగచైతన్య - శృతిహాసన్ - అనుపమ పరమేశ్వరన్ - మడోన్నా సెబాస్టియన్ స్టారర్ ఆడియో.. ఏకంగా దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినాన రిలీజవుతోంది కాబట్టి.. ఖచ్చితంగా యావత్ అక్కినేని ఫ్యామిలీ విచ్చేసే ఛాన్సుంది. నాగ్ - అమల - చైతన్య - అఖిల్ - సుమంత్ - సుశాంత్ - నాగసుశీల.. ఇలా ఫ్యామిలీ ఖచ్చితంగా వస్తారనే తెలుస్తోంది. ఇకపోతే ఇతర దర్శక దిగ్గజాలూ - హీరోలు కూడా విచ్చేసే ఛాన్సుంది. నాగ్ - చై అండ్ అఖిల్ తో త్వరలో పనిచేయబోయే డైరక్టర్లు.. ఇప్పటికే పనిచేస్తున్న డైరక్టర్లు కూడా విచ్చేస్తారు. కాని ఎంతమంది వచ్చినా అందరి కళ్ళూ ఒకే ఒక్క హీరోయిన్ పై ఉంటాయి.

డౌటే లేదు.. ఇప్పటికే చాలావరకు ఓపెన్ అయిపోయిన నాగ చైతన్య అండ్ సమంత రిలేషన్ గురించి డిస్కషన్లన్నీ. కాబట్టి ఈ సినిమా ఈవెంట్ కు.. అదికూడా ఏఎన్నార్ బర్త్ డే రోజు జరుగుతున్న ఈవెంట్ కాబట్టి.. మరి మొన్నామధ్యన నిమ్మగడ్డ కూతురు పెళ్ళిలో ఎలాగైతే సమంతను అందరికీ నాగ్ పరిచయం చేశారో.. ఇప్పుడు కూడా అలా ఈ ఆడియో వేదికకు ఆమెను ఇన్వయిట్ చేస్తారా అనేదే చూడాల్సిన విషయం.

అసలు మనలో మన మాట.. ఒకవేళ ఈ ఆడియో వేదికపైనే నాన్నగారి బర్త్ డే శుభ సందర్భాన నాగ్ తన ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళ గురించి చెప్పేస్తారా ఏంటి? లెటజ్ సీ

,  ,  ,  ,  ,  ,  ,