Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2016 10:39:02
facebook Twitter Googleplus
Photo

పెళ్లి ఖాయం అయిపోయింది.. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అందుకే నాగచైతన్య సమంత కలిసి జాలీగా కలిసి మెలిసి సాగిపోతున్నారు. కలిసుండటం అంటే ఇంతకుముందులాగా అప్పుడప్పుడూ కాదు. ఇద్దరూ ఒకే ఇంట్లోనే.. రెగ్యులర్ కపుల్ లాగే ఉంటున్నారు. ఇటీవలే సమంత తన మకాంను పూర్తిగా నాగచైతన్య ఇంటికే మార్చేసినట్లు సమాచారం.

హైదరాబాద్ లో చాలా ఏళ్లుగా ఉంటున్న సమంత.. తన కోసం ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. దాంతో పాటు పార్క్ హయత్ హోటల్లోనూ అప్పుడప్పుడూ మకాం వేసేది. ఇక అప్పుడప్పుడూ తన ఫ్రెండ్ నీరజ కోన వాళ్లింట్లోనూ ఉండేది. ఐతే ఇటీవలే ఆమె తన లగేజ్ మొత్తం చైతూ ఉంటున్న లగ్జరీ అపార్ట్ మెంట్లోకి మార్చేసినట్లు తెలిసింది.

హీరో కాకముందు చైతూ తన తాతయ్య రామానాయుడు ఇంట్లో ఉండేవాడు. కొన్నాళ్లు నాన్న నాగార్జున ఇంట్లోనూ ఉన్నాడు. ఐతే హీరో అయ్యాక మాత్రం తనకంటూ ప్రత్యేకంగా ఇల్లు తీసుకున్నాడు. అందులో ఒకడే ఉంటున్నాడు. ఆ ఇంటికే సమంత మకాం మార్చినట్లు సమాచారం. వీళ్లిద్దరూ ఈ మధ్య పర్సనల్ స్పేస్ ను బాగా ఆస్వాదిస్తున్నట్లు తెలిసింది. సమంత సినిమాల్ని పక్కనబెట్టేసి చైతూతో హ్యాపీగా కాలం గడిపేస్తోంది. వచ్చే ఆగస్టులో వీళ్లిద్దరి పెళ్లి జరిగే అవకాశముంది. ఆలోపు చైతూ.. సమంత ఒకరి గురించి ఒకరు మరింత అవగాహన పెంచుకునేలా ఉన్నారు.

,  ,  ,  ,  ,  ,