Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2015 16:56:29
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్-సమంత కాంబినేషన్ సెట్ చేయడానికి చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ ప్రయత్నాలు ఫలించట్లేదు. ఇంతకుముందు ?ఎవడు? సినిమాలో ఆమెనే హీరోయిన్ అనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ?బ్రూస్ లీ? సినిమాకు కూడా ముందు ఆమె పేరే వినిపించింది. సాధ్యం కాలేదు. ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమా ?తనీ ఒరువన్? రీమేక్ లో సమంత నటించబోతోందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది కూడా నిజం కాదని తేలిపోయింది. స్వయంగా సమంతే తానీ సినిమాలో నటించట్లేదని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేసింది.

??రామ్ చరణ్ తో తనీ ఒరువన్ రీమేక్ లో నేను నటిస్తున్నానన్నది అబద్ధం. ప్రస్తుతం నేను తెలుగులో బ్రహ్మోత్సవం అ..ఆ సినిమాలు చేస్తున్నా. తమిళంలో విజయ్ తో నటిస్తున్నా?? అని చెప్పింది సమంత. తనీ ఒరువన్ ఒరిజినల్ లో నయనతార కథానాయికగా నటించింది. అక్కడ ఆమె క్యారెక్టర్ కి మంచి పేరే వచ్చింది. తెలుగు వెర్షన్ కి ముందు కాజల్ పేరు వినిపించింది. తర్వాత ఎవరో బాలీవుడ్ భామ కోసం ట్రై చేస్తున్నారన్నారు. కొన్ని రోజుల నుంచి సమంత పేరు రౌండ్లు కొట్టింది. ఐతే ఇప్పటిదాకా ఏ పేరూ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఐతే హీరోయిన్ కంటే ముందు విలన్ రోల్ ఎవరు చేస్తారన్నది తేలాల్సి ఉంది. తమిళంలో చేసిన అరవింద్ స్వామే తెలుగులోనూ నటిస్తాడని అంటున్నారు కానీ.. అది కూడా కన్ఫమ్ ఏమీ కాదు.

,  ,  ,  ,  ,