Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2017 11:24:47
facebook Twitter Googleplus
Photo

వ్యవసాయం తరువాత ఎక్కువ మంది జీవిన ఆదారం సాంప్రదాయ చేతి మగ్గములు పై నేసిన వస్త్రాలు తయారు చేసి వాటిని అమ్మడం. 2015 ఏడు నుండి ఆగష్టు 7న జాతీయ హ్యాండ్లూమ్ డే జరుపుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కే.టి. రామరావు ఆగష్టు 7 నాడు ఘనంగా జరుపుకోవాలి అని చేనేత వస్త్రాలు పై అవగాహన పెంచి వాటికి ప్రచారం చేసి చేనేత కార్మికులును ప్రోత్సహించాలి అని కంకణం కట్టుకున్నాడు. అందుకు సంబంధించిన పొదుపు పథకాలు - సబ్సిడీలు కొన్ని కొత్త వడ్డీ పథకాలు కూడా సిద్దం చేశాడు.

తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ ప్రచారకర్తగా స్టార్ హీరోయిన్ సమంత పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. సమంత ఈ ప్రచారంలో భాగంగా.. వోవెన్ 2017 (Woven2017) అనే కార్యక్రమానికి నేను ప్రచారం చేయడం నాకు చాలా తృప్తిని ఇచ్చింది అంటోంది. జాతీయ హ్యాండ్లూమ్ డే ని ఇంత గొప్పగా తలపెట్టినందుకు కే టి రామరావు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పింది సమంత. ఆగష్టు 7 నాడు ఒక ఫ్యాషన్ షో కూడా జరగబోతుంది. అందులో సమంత కూడ పాల్గొనబోతుంది. వోవెన్ – ఏ వాక్ టు ఫ్యాషన్ అనే పోగ్రామ్ కూడా జరపబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఈవెంట్ ద్వారా చేనేత పరిశ్రమలో ఉన్న రకరకాల పద్దతులుతో బట్ట నేసిన విధానాలు పై అవగాహన కలిపిస్తూ ఆ పరిశ్రమకు మరింత ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

చేతి మగ్గాల పండుగకు సమంత కొత్త జోష్ ని ఇవ్వబోతుంది ఆ రోజు. ఇప్పటికే సమంత హ్యాండ్లూమ్ పేరు తో కొన్ని మోడ్రన్ దుస్తులు వేసుకొని ఆ మధ్య హాట్ టాపిక్ గా మారింది.

,  ,  ,  ,  ,