Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jan-2016 11:33:42
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం షూటింగ్.. సూపర్బ్ పేస్ లో పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్ కూడా మొదలైపోయింది. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ.. సమంత కూడా షూటింగ్ లో జాయిన్ అయిపోయింది.

బ్రహ్మోత్సవం షూటింగ్ మొదలై ఐదు నెలలు గడిచినా సమంత మాత్రం యూనిట్ కు జత కాకపోవడంతో.. ఈమెను తప్పించారనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్న రకుల్ ప్రీత్ ను సింగ్ ను తీసుకున్నారని సమంత ను రకుల్ తో రీప్లేస్ చేశారని అన్నారు. ఇప్పుడు ఇలాంటి పుకార్లు అన్నిటికీ చెక్ పడిపోయినట్లే. సమంత కూడా వచ్చి షూటింగ్ లో జతయిందని.. బ్రహ్మోత్సవం యూనిట్ అధికారికంగానే చెప్పింది.

సోషల్ సైట్లలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత కూడా.. ఇలాంటి రూమర్స్ వచ్చినపుడు స్పందించలేదు. ట్విట్టర్ లో ఆమెను నేరుగా ప్రశ్నించినా సరే బ్రహ్మోత్సవం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఏదో జరిగిందని అందరూ అనుకున్నారు. అయితే సైలెంట్ గా తన పని చేసుకుపోయిన శామ్స్.. ఇప్పుడు షూటింగ్ కూడా మొదలుపెట్టేసింది. ఇలాంటి కల్లబొల్లి వార్తలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని సమంత అనుకుందని చెబ్తున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవం మూవీని ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని నిర్ణయించాడు మహేష్ బాబు.

,