Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2017 14:11:39
facebook Twitter Googleplus
Photo

సమంత.. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది. చెప్పినట్లుగానే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సామ్. హైద్రాబాద్ లో ఇచ్చిన గ్రాండ్ రిసెప్షన్ తో 40 రోజుల పెళ్లి వేడుకలు ముగిశాయంటూ తనే చెప్పిన సమంత.. అక్కడి నుంచి వరుస షూటింగ్స్ చేసేస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ తో తొలిసారిగా జోడీ కట్టి సమంత నటిస్తున్న మూవీ రంగస్థలం 1985. ఈ పీరియాడిక్ మూవీ షూటింగ్ తో.. తిరిగి సినిమాలను ప్రారంభించిన సామ్.. జస్ట్ 2-3 రోజులు ఇక్కడ షూటింగ్ జరిపి.. ఇప్పుడు కోలీవుడ్ జంప్ అయిపోయింది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మూవీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా యూనిట్.. తమ మూవీ మూడో షెడ్యూల్ ను ప్రారంభించినట్లు నిన్న అఫీషియల్ గా వెల్లడించింది. లంగా జాకెట్ తో సమంత ఫోటోలకు పోజులు కూడా ఇచ్చింది. ఇప్పటికే 55 శాతం షూటింగ్ కంప్లీట్ చేశామని.. ఫిబ్రవరిలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పారు నిర్మాతలు.

మరోవైపు పెళ్లి తర్వాత సమంత కొత్త సినిమాలు ఏవీ ఇంకా సైన్ చేయలేదు. అయితే.. ఇప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్టులను మాత్రం చకచకా ఫినిష్ చేస్తోంది సామ్. వీటిని కంప్లీట్ చేసేందుకే ఈ భామకు నాలుగైదు నెలలు పడుతుందని అంటున్నారు.

,  ,  ,  ,