Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 16:55:41
facebook Twitter Googleplus
Photo

సౌతిండియాలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత వార్తల్లో ఉన్నట్లుగా మరే హీరోయిన్ లేరేమో! ఆమె హీరోయిన్‌గా నటించిన నాలుగు సినిమాలు రెండు నెలల తేడాలో రెండొందల కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాయి. ఈ సినిమాల్లో ?థేరీ? (పోలీస్), ?24? ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ కొడితే, ?బ్రహ్మోత్సవం?, ?అ..ఆ..? త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమంత తన సినిమాల గురించి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు..
ప్రశ్న) సౌతిండియాలో ఇప్పుడు మీ సినిమాల హడావుడే కనిపిస్తోంది. ఎలా అనిపిస్తోంది?
స) చాలా సంతోషంగా ఉంది. ?తేరీ?, ?24?, ?బ్రహ్మోత్సవం?, ?అ..ఆ..? ఇలా నేను నటించిన నాలుగు సినిమాలు ఒకేసారి రావడం, అన్నీ దేనికవే డిఫరెంట్ జానర్ సినిమాలు కావడం నా అదృష్టం. ?తేరీ? బ్లాక్‌బస్టర్ అయిపోయింది. ?24? కూడా అదే బాటలో సూపర్ రెస్పాన్స్‌తో వెళుతోంది. రేపొచ్చే రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ అవుతాయన్న నమ్మకం ఉంది. ఇంతకంటే నేను కోరుకునేది ఏముంటుంది?
ప్రశ్న) ?తేరీ?, ?24? సినిమాలకు మీ క్యారెక్టర్ పరంగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
స) ?తేరీ?, ?24?.. రెండు సినిమాల్లోనూ దేనికదే డిఫరెంట్ రోల్ చేశా. రెండింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్యే వచ్చిన 24, కథ ప్రకారంగా సీరియస్ మోడ్‌లో నడుస్తూంటుంది. నా రోల్ అలాంటి కథకు కొంత రిలీఫ్ ఇచ్చేలా ఉందని టాక్ వచ్చింది. చేసే ప్రతి సినిమాలోనూ నాదంటూ ఓ ఐడెంటింటీ ఉండేలా చూసుకుంటూ వస్తున్నా. అదే ఈ స్థాయి విజయాల్లో నాకూ కొంత క్రెడిట్ ఇస్తూ వస్తోంది.
ప్రశ్న) వరుసగా ఇన్ని సినిమాలు చేయడం వల్ల వ్యక్తిగత జీవితం కోల్పోతున్నాననే ఫీలింగ్ కలిగిందా?
స) నిజంగానే ఒక ఎనిమిది నెలలుగా సెలవంటూ లేకుండా సినిమాలు చేస్తున్నా. మొన్న ఒక రోజు తేరీ ప్రమోషన్స్, 24 ప్రమోషన్స్, బ్రహ్మోత్సవం షూట్, వేరే ఇంకేదో పని.. ఇవన్నీ ఒకేసారి గంటల తేడాలో వచ్చిపడ్డాయి. అప్పుడు మాత్రం నిజంగానే అరగంట పాటు ఏడ్చేశా. ఇకపై మాత్రం ఎక్కువగా సినిమాలు ఒప్పుకోవట్లేదు. నా వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కువ ప్రాధ్యాన్యతనివ్వాలని ఫిక్స్ అయిపోయా.
ప్రశ్న) ఇప్పుడు కూడా ఇంకా బిజీగానే ఉన్నట్టున్నారు?
స) ఇంకా బిజీగానే ఉన్నా. ?బ్రహ్మోత్సవం?, ?అ..ఆ..? రెండు సినిమాలు విడుదలయి, ?జనతా గ్యారెజ్? షూటింగ్ కూడా అయిపోతే ఇంక పూర్తిగా రిలాక్స్ అయిపోదామని అనుకుంటున్నా.
ప్రశ్న) ?బ్రహ్మోత్సవం?, ?అ..ఆ..? సినిమాల్లో మీ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి?
స) బ్రహ్మోత్సవంలో శ్రీకాంత్ అడ్డాల మార్క్ చలాకీ అమ్మాయి పాత్ర నాది. ఆయన సినిమాల్లో ప్రతి పాత్రకూ ఓ ప్రాధాన్యత ఉంటుంది. బ్రహ్మోత్సవంలో నా పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక త్రివిక్రం గారి అ..ఆ.. సినిమాలోనూ చాలా మంచి రోల్ చేశా. ఆ పాత్ర ద్వారా నన్ను చాలాకాలం గుర్తుపెట్టుకుంటారన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) ?బ్రహ్మోత్సవం?, ?అ..ఆ..? తర్వాత ఇక సినిమాలు ఒప్పుకోరా?
స) అలా అని కాదు కానీ, ఒక కథలో నా అవసరం తప్పక ఉండి, అది నేను మాత్రమే చేయగలిగింది అనుకున్నప్పుడు కచ్చితంగా ఆ సినిమా చేస్తా. ?యూ టర్న్? అనే ఓ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నా. అది నేను ఇప్పటివరకూ చేసినవాటిల్లో డిఫరెంట్!
ప్రశ్న) వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఈమధ్యే సీనియర్ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. ఈ ట్యాగ్‌ని ఎలా తీసుకుంటారు?
స) అవును, సీనియర్ హీరోయిన్ అని ఈ మధ్యే ఎవరో అన్నారు. నేనింకా అంత సీనియర్ అయిపోలేదు. అందుకే ?జనతా గ్యారెజ్? కోసం లుక్ కూడా మార్చేశా!! (నవ్వుతూ..)
ప్రశ్న) చిరంజీవి 150వ సినిమాకు మిమ్మల్ని సంప్రాదించారని వినిపించింది. అది ఎంతవరకు నిజం?
స) అలాంటిదేమీ జరగలేదు. బహుశా చిరంజీవి గారి సినిమా కత్తికి రీమేక్ అవ్వడం వల్ల ఇందులో నేనూ నటిస్తున్నాననే వార్త వచ్చి ఉండొచ్చు.
ప్రశ్న) చివరగా, ఇంకా సింగిల్ స్టేటస్‌నే ఎంజాయ్ చేస్తున్నారా?
స) నేను సింగిల్ అని ఎవరు చెప్పారూ? కట్. ఇంకా..!! (నవ్వుతూ..)

,  ,  ,  ,