Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Dec-2014 11:22:23
facebook Twitter Googleplus
Photo

సమంతాకి ఇప్పుడు ఓ సినిమా తెగ నచ్చేసింది. ఆ సినిమా గురించి 'ఆహా... ఓహో' అంటూ తెగ ప్రచారం కూడా చేసేస్తోంది. ఓపక్క సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ ... మరోపక్క మౌత్ టాక్ తోనూ కూడా ప్రచారం ఇస్తోంది. ఆ సినిమా పేరు 'కావ్య తలైవన్'. ఈ చిత్రాన్ని చూసి వచ్చి ఇదొక మాస్టర్ పీస్ అంటూ పొగిడేస్తోంది. సినిమా చూశాక అమ్మడికి మనసంతా అదోలా అయిపోయిందట. ఇంతకీ ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరనుకుంటున్నారు... ఆమె స్నేహితుడు సిద్ధార్థ్! అందుకే, ఈ సినిమా ఆమెకు అంతగా నచ్చిందా? లేక నిజంగానే సినిమాలో విషయం ఉందా? అన్నది ఎవరికి వారు తెలుసుకోవలసిందే!

,  ,  ,  ,  ,