Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 18:55:45
facebook Twitter Googleplus
Photo

ఆల్టిమేట్ గా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ ఎంత అందంగా కనిపించింది అనే విషయంపైనే బాక్సాఫీస్ దగ్గర ప్రభావం కనిపిస్తుంది. అవన్నీ తెలిసిన స్టార్ లేడీ సమంత.. అ..ఆ లో ఎలా కనిపించాలి.. అలాగే జనతా గ్యారేజ్ లో ఎలా కనిపించాలి అనే విషయంలో మామూలు క్లారిటీ చూపించట్లేదనుకోండి. అమ్మడు తన హాట్ లుక్ తో చితక్కొట్టేస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ?జనతా గ్యారేజ్? చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్ లో సమంత దిగిన ఒక ఫొటోను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. గ్రీన్ కలర్ లో ఉన్నస్కిన్ నీ దుస్తుల్లో మెరుస్తూ కనిపించిన సమంత.. అబ్బో ఎంత సెక్సీ ఉందంటే.. ఎవరైనా కూడా ఫ్లాట్ అయిపోవాల్సిందే. పైగా ఈమె సెక్సీ లుక్ ను సపోర్టు చేస్తూ వెనుకనే ఉన్న ఆ సెట్టింగ్ కూడా అదిరిపోయింది.

గతంలో సమంత రభస సినిమాలో జూనియర్ సరసన ఇంతకంటే హాటుగా కనిపించినప్పటికీ.. ఇప్పుడు మరింత హాటుగా కనిపిస్తోంది. ఒక ప్రక్కన అ..ఆ సినిమా అసలే ఓవర్సీస్ లో 2.25 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అనే ఆనందం.. ఇంకో ప్రక్కన ఇలా హాటు హాటుగా ఊరించడం.. అబ్బో సమంతకే చెల్లింది.

,  ,  ,  ,  ,