Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 11:42:31
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే సమ్మర్లో ఒకటికి రెండు సూపర్ హిట్లు కొట్టేసింది సమంత. ఇంకో మూడు వారాల్లో మరో రెండు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది ఈ క్యూట్ హీరోయిన్. సమంత కెరీర్లో పీక్స్ అంటే ఇదే అని చెప్పాలి. ఇంకో మూణ్నాలుగేళ్లయినా హీరోయిన్ గా టాప్ రేంజిలో కొనసాగే అవకాశాలున్నాయి సమంతకు. ఇలాంటి టైంలో మళ్లీ లవ్వూ గివ్వూ అంటోంది సామ్.

ఉత్తినే తమాషాకు అందో.. లేక సీరియస్సో తెలియదు కానీ.. తాను ప్రస్తుతం సింగిల్ కాదని మాత్రం ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది సమంత. 24 సక్సెస్ సంబరాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత.. మీరిప్పుడు సింగిలే కదా అంటే కాదు అని బదులిచ్చింది. అంతటితో ఆగకకుండా నేను సింగిల్ అని మీకెవరు చెప్పారు అని కూడా ప్రశ్నించింది సామ్. కెరీర్ ఆరంభంలోనే సిద్దార్థ్ తో ప్రేమలో పడటం.. మూణ్నాలుగేళ్లు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగాక.. రెండేళ్ల కిందట విడిపోవడం తెలిసిన సంగతే.

రెండు రోజుల కిందట మదర్స్ డే సందర్భంగా తాను మంచి కూతుర్ని కాను.. ప్రేయసిని కూడా కాదంటూ సమంత చేసిన వ్యాఖ్యల మీద పెద్ద చర్చ నడుస్తుండగానే ఇప్పుడు తాను సింగిల్ కాదని వ్యాఖ్యానించి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది సమంత. మరి సమంత నిజంగానే కొత్త ప్రేమాయణం మొదలుపెట్టిందని అనుకోవాలా.. లేక ఏదో సరదాకి ఆ మాట అనేసిందా..? ఈ వ్యాఖ్యల మీద కొంచెం చర్చ నడిచాక సమంతే క్లారిటీ ఇవ్వకపోదులెండి.

,  ,  ,  ,  ,