Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-May-2017 11:06:28
facebook Twitter Googleplus
Photo

సమంత గత ఏడాది యు టర్న్ ఓ కన్నడ సినిమా మీద మనసు పడింది. లూసియా తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు పవన్ కుమార్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా యు టర్న్. ఈ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ కన్నడలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఆశించింది సమంత. ఆమే స్వయంగా రీమేక్ హక్కులు కొనుగోలు చేసిందని.. తనే లీడ్ రోల్ చేస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇకపై నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేయాలనుకుంటున్నట్లు సమంత స్టేట్మెంట్లు ఇచ్చేసరికి

యు టర్న్ లో ఆమె నటించడం పక్కా అనే అనుకున్నారంతా. కానీ సమంత ఈ సినిమా చేయట్లేదన్నది తాజా సమాచారం. యు టర్న్ తెలుగులో వర్కవుట్ కావడం కష్టమని భావించి సమంత ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఆమె నటించట్లేదంటే యు టర్న్ తెలుగు రీమేక్ ఆగిపోయినట్లే అన్నమాట. ప్రస్తుతం సమంత చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. రామ్-చరణ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు రాజుగారి గది-2 లోనూ నటిస్తోంది సామ్. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా చేస్తోంది. ఇంకో రెండు తమిళ సినిమాల ఆఫర్లు కూడా ఆమె చేతిలో ఉన్నాయట. మొత్తానికి నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ అయినప్పటికీ సమంత కెరీర్ కు ఢోకా ఏమీ కనిపించట్లేదు.

,  ,  ,  ,  ,  ,  ,