Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2015 16:22:13
facebook Twitter Googleplus
Photo

సంగీత దర్శకుడు జీ.వీ.ప్రకాష్ కుమార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అతడు నటించిన పెన్సిల్ కోలీవుడ్ లో పెద్ద హిట్. ఇటీవలి కాలంలో అతడు నటించిన 'త్రిష లేదా నయనతార' (త్రిష ఇలియానా నయనతార -కోలీవుడ్ లో) రిలీజ్కి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో జీవీ అప్పియరెన్స్ గురించి తెలుగు తమిళ పరిశ్రమల్లో విస్త్రతంగా చర్చ సాగుతోంది.

జీవీ మాస్ స్టయిల్ శ్రీదివ్య మనీషా యాదవ్ లతో సరసాలు అదిరిపోయాయంటూ ప్రశంసలొస్తున్నాయి. సరిగ్గా ఇదే టైమ్ లో అతడిని పెద్ద సూపర్ స్టార్గా ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవీ చూడటానికి కాస్త పొట్టిగా కనిపించినా చాలా గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నాడని కోలీవుడ్ లో ముచ్చటించుకుంటున్నారు. ఈసారి అతడు ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కథానాయికగా సమంతని ఎంపిక చేసుకున్నారు. సుధాకర్-గుణ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ నిర్మిస్తున్నారు.

అయితే జీవీ సరసన నటించడానికి సమంత ఓకే చెబుతుందా? కుదరదని మొహం చాటేస్తుందా? వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ భామతో నిర్మాతలు మంతనాలు సాగిస్తున్నారు. జెస్సీ ఇంకా ఓకే చెప్పాల్సి ఉంది. ఒకవేళ ఒకే చెప్పేస్తే ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ మనం తెరపైన త్వరలోనే చూడొచ్చు.

,  ,