Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2016 11:07:45
facebook Twitter Googleplus
Photo

ఒక ఇన్సిడెంట్ ఒక జీవితాన్నే మార్చేస్తుందంటే నమ్మడం కష్టం. చాలాసార్లు ఇలా జరక్కపోయినా.. కొన్ని సార్లు మాత్రం లైఫ్ ను ఛేంజ్ చేసే ఇన్సిడెంట్స్ అలాగే జరుగుతాయి. సమంత విషయంలో కూడా జరిగిందదే. అనుకోకుండా శామ్స్ ఫోటోలు చూసిన గౌతమ్ మీనన్.. హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడని గతంలోనే తెలుసు. కానీ ఇప్పుడు ఆ అనుకోకుండా చూడ్డం ఎలా జరిగిందో.. పూస గుచ్చినట్లు డీటైలింగ్ ఇచ్చింది సమంత.

'టీనేజ్ లో ఉన్నపుడు జరిగిన ఓ బర్త్ డే పార్టీనే నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్. నాకు ఆత్మీయురాలైన ఓ క్లోజ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లాను. అక్కడ చాలా ఫోటోలు తీశారు. ఆ తర్వాత రోజున ఫోటోలు పేపర్లో వచ్చాయి. వాటిని చూసి చెన్నైకి చెందిన ఓ వ్యాపారి నన్ను కలిసి.. తమ క్లాత్ షోరూమ్ కి మోడలింగ్ చేయాల్సిందిగా అడిగారు. అలా నేను ఊహించకుండానే మోడల్ గా మారిపోయాను' అన్న సమంత.. గతంలో తనకు కెమేరా అంటే భయమని.. పాకెట్ మనీ కోసం మోడల్ గా మారానని చెప్పింది.

'మోడల్ గా మారిన తర్వాత సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ద్వారా నాకు సినిమా హీరోయిన్ ఛాన్స్ లభించింది. నా ఫోటోలను చూసిన దర్శకుడు గౌతమ్ మీనన్.. ఏం మాయ చేశావె చిత్రంలో చైతు సరసన హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. అందులో చేసిన జెస్సీ పాత్రకు విపరీతమైన గుర్తింపు రావడంతో.. హీరోయిన్ అయిపోయాను' అంటూ అ..ఆ.. ప్రమోషన్స్ లో చెప్పింది సమంత.

,  ,  ,  ,  ,  ,