Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 13:10:43
facebook Twitter Googleplus
Photo

ప్రత్యేక హోదా కోసం విశాఖలో తలపెట్టిన శాంతి ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కే బీచ్ దగ్గర నిర్వహించాలనుకున్న శాంతి ధర్నాలో పాల్గొంటానని ఇప్పటికే సోషల్ మీడియాలో చెప్పిన సంపూర్ణేష్ అందుకు తగ్గట్లే ఈ ఉదయం విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

సంపూర్ణేష్ బాబు వచ్చిన విమానంలోనే టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఉన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులు కలుగజేసుకొని.. ధర్నాకు పోలీసుల అనుమతి లేదని.. ఈనేపథ్యంలో ధర్నాలో పాల్గొనకూడదని కోరారు. దీనికి ఆయన ఓకే అని కారులో కూర్చున్నారు. ఆయన వెనుక ఉన్న సంపూర్ణేష్ బాబు మీడియాతో మాట్లాడుతున్న వేళ.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

మీడియాతో మాట్లాడే సందర్భంలో విశాఖలో పోలీసులు విధించిన ఆంక్షలు.. యువతను నిర్బందించటం లాంటివి యువత సాధించిన విజయాలుగా సంపూర్ణేష్ బాబు పేర్కొన్నారు. ఈసందర్భంగా పోలీసులుఆయన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తెలంగాణ ప్రాంతాని (సిద్దిపేట)కి చెందిన టాలీవుడ్ నటుడు ఒకరు ప్రత్యేక హోదా సాధన కోసం నిర్వహిస్తున్న నిరసనకు హాజరయ్యేందుకు రావటం ఒక ఎత్తు అయితే.. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

,  ,  ,  ,