Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jun-2015 17:51:06
facebook Twitter Googleplus
Photo

'కిల్లింగ్ వీరప్పన్' సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కించనున్నాడనే వార్త రాగానే, ఈ సినిమాలో వీరప్పన్ ఎవరు? అనే ఆసక్తి మొదలైంది. వీరప్పన్ ని అంతం చేసే పోలీస్ అధికారిగా శివరాజ్ కుమార్ నటిస్తాడని చెప్పిన దగ్గర నుంచి, ఈ కుతూహలం ఇంకా ఎక్కువ కాసాగింది. తాజాగా ఈ ఆసక్తిని ఆశ్చర్యంగా మార్చేశాడు వర్మ.

వీరప్పన్ పోలికలకి దగ్గరగా వున్న వ్యక్తిని తన సినిమాకి వర్మ ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు సందీప్ భరద్వాజ్ .. ఢిల్లీకి చెందిన ఇతగాడు థియేటర్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది. అచ్చు వీరప్పన్ మాదిరిగానే కనిపిస్తోన్న సందీప్ భరద్వాజ్ నుంచి, వీరప్పన్ బాడీ లాంగ్వేజ్ కి తగిన నటనను వర్మ రాబడుతున్నాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమా, త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషా ప్రేక్షకుల ముందుకి రానుంది.

,  ,  ,