ప్రస్తుతం 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' చిత్రాలలో నటిస్తున్న రవితేజ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. రామ్ తో 'కందిరీగ', ఎన్టీఆర్ తో 'రభస' చిత్రాలను రూపొందించిన సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గా మాస్ ఓరియెంటెడ్ కథను సంతోష్ చెప్పడంతో ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ పడినట్టు సమాచారం. దీనికి 'తిక్కరేగింది' అనే టైటిల్ని కూడా ఇప్పటికే రిజిస్టర్ చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నట్టు చెబుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
raviteja, santoshsrinivas, tikkaregindhi, news, tollywood,