Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2016 10:28:10
facebook Twitter Googleplus
Photo

సినిమా రివ్యూలపై ఆయా సినిమాల హీరోలు నిర్మాతలు దర్శకులు విమర్శలుచేయడం సర్వసాధారణంగా మారిపోయిన రోజులివి!! సినిమాలపై ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా రివ్యూలు రాసేస్తుంటారు వారికే అంత నాలెడ్జ్ ఉంటే వారినే తియ్యమనండి... అంటూ మూవీ మేకర్స్ ఆయా రివ్యూ రైటర్స్ పై ధ్వజమెత్తుతుంటారు. ఇక కొంతమంది రివ్యూ రైటర్స్ వెర్షన్ అయితే... కాకిపిల్ల కాకికి ముద్దు అని కౌంటర్ వేస్తుంటారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే... తాజాగా రివ్యూలపై సప్తగిరి హీరో స్పందించాడు.

హీరోగా మారిన హాస్యనటుడు సప్తగిరి "సప్తగిరి ఎక్స్ ప్రెస్" సినిమా గతవారం విడుదలై విజయవంతగా నడుస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో సప్తగిరి కంటతడి పెట్టుకున్నాడు. దానికి కారణం... నెగిటివ్ గా రాసిన సినిమా రివ్యూలట!! అవును... తామంత ఎంతో కష్టపడి సినిమా బాగా తీస్తే రివ్యూలు మాత్రం నెగిటివ్ గా రాశారని చెబుతూ ఆ సమయంలో సప్తగిరి కంటతడి పెట్టుకున్నారు! అనంతరం... హీరోగా తాను చేసిన తొలిసినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదలు చెప్పాదు. అలాగే.. దర్శకుడు కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఫైనల్ గా నటుడిని అయ్యానని అయినా సరే ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తానని సప్తగిరి స్పష్టంచేశాడు.

ఈ సినిమా వస్తూళ్లపై స్పందించిన నిర్మాత రవికిరణ్... ఈ సినిమాపై రివ్యూలు కాస్త అటు ఇటుగా వచ్చినప్పటికీ బి సి సెంటర్స్ లో బాగానే వసూళ్లు ఎలా ఉన్నాయనే విషయం గణాంకాలు వెల్లడిస్తున్నాయని మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.35 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ప్రకటించారు.

,  ,  ,  ,  ,