Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 12:18:28
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సప్తగిరి ఎక్స్ ప్రెస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. కమెడియన్ హీరో అవడం కొత్త కాదు కానీ.. దీనికి ఏకంగా పవర్ స్టార్ నుంచి సపోర్ట్ రావడంతో.. మెగాభిమానులు కన్ను సప్తగిరి ఎక్స్ ప్రెస్ పై పడింది. రీసెంట్ గా పవన్ చేతుల మీదుగా ఆడియో ఫంక్షన్ జరుపుకున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

పేరుకు హీరో అయినా.. సప్తగిరి కంప్లీట్ గా తన జోనర్ లోనే చేశాడు. తెలుగు సినిమా హీరో కాబట్టి పాటలు-ఫైట్స్ చేశాడు తప్ప.. ఓవరాల్ గా సినిమా అంతా కామెడీ జోన్ లోనే నడిపించేందుకు ట్రై చేశాడని అనిపిస్తుంది. అది కూడా తనకు బాగా అలవాటైన సూపర్ ఫాస్ట్ డైలాగ్ డెలివరీతో ట్రైలర్ అంతా ఆకట్టుకున్నాడు. ట్రైలర్ ప్రారంభం నుంచి ఆఖరివరకూ సప్తగిరి పేల్చిన పంచ్ లు బాగానే పేలాయి. హీరోయిన్ రోషిణి ప్రకాష్ గ్లామర్ కూడా బాగానే ఆకట్టుకున్నా.. సినిమా ఎక్కువగా పోలీసుల చుట్టూతానే తిప్పినట్లుగా అర్ధమవుతోంది.

'ది చెడ్డీ మ్యాన్' అంటూ వల్లభ మూవీలో శింబు కేరక్టర్ ని ఇమిటేట్ చేస్తూ.. సప్తగిరి వేసిన ఆఖరి పంచ్ బాగానే బ్లాస్ట్ అవుతుంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో షకలక శంకర్ కేరక్టర్ ని సంథింగ్ డిఫరెంట్ గా తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తోంది. అన్నిటికీ మించి ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్ లో ఉండడం ఈ మూవీకి అడ్వాంటేజ్ కాగా.. బుల్గానిన్ అందించిన మ్యూజిక్ మూవీ వాల్యూ పెంచేసిందని చెప్పాలి.

,  ,  ,  ,  ,