Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 18:14:16
facebook Twitter Googleplus
Photo

డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్.. తెలుగులో గత కొద్దికాలంగా ప్రతి పెద్ద సినిమాకూ వాడుతూ వస్తోన్న సౌండ్ టెక్నాలజీ. 2012లోనే ఇండియన్ సినిమాలో వాడుకలోకి వచ్చిన ఈ సిస్టమ్, ?బాహుబలి?, ?శ్రీమంతుడు? లాంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌ ఈ టెక్నాలజీని వాడడంతో ఈ మధ్య కాలంలో తెలుగులోనూ పాపులర్ అయిపోయింది. ఇక తాజాగా భారీ అంచనాల మధ్యన ఏప్రిల్ 22న విడుదల కానున్న ?సరైనోడు? సినిమా కూడా డాల్బీ అట్మాస్ సౌండ్‌తో సందడి చేయనుంది. సంగీత దర్శకుడు థమన్‌తో కలిసి టీమ్ ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసింది.
భోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం జత కావడంతో సౌండ్ పరంగా సినిమా ప్రేక్షకులను మరింతగా కట్టిపడేస్తుందని థమన్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆడియో, పోస్టర్స్‌తో ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయికి చేరిపోయాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,