Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 12:21:26
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసే ఆలోచనతో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ సరైనోడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. మాస్ దర్శకుడు భోయపాటి శీను తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకొనే సుమారు 1600లకు పైగా థియేటర్లలో రేపు ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. భోయపాటి టీమ్ సినిమా విజయంపై మొదట్నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వస్తోంది.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేపట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ట్రైలర్, పోస్టర్స్‌తో రేకెత్తించిన అంచనాలను అందుకునేలానే సినిమా ఉండనుందని ప్రచారం పొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,  ,