Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 12:55:17
facebook Twitter Googleplus
Photo

కట్టప్ప అంటే గుర్తుపట్టని సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఖబాహుబలి?తో ఆ పాత్ర, దాన్ని పోషించిన సత్యరాజ్‌ అంతగా ప్రాచుర్యం పొందారు. నాలుగు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో కట్టప్ప స్థాయిలో గుర్తింపు తెచ్చిన మరొక పాత్ర లేనే లేదంటారు సత్యరాజ్‌. కథానాయకుడు, ప్రతినాయకుడు, సహాయక పాత్రల్లో నటించి పలు భాషల్లో ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇటీవల తనయుడు శిబిరాజ్‌తో కలిసి ఖదొర?గా ప్రేక్షకుల ముందుకొచ్చారు...
ఖఖనటనంటే నాకు చిన్నప్పట్నించీ ఆసక్తి. నాటికలు వేసి పేరు తెచ్చుకున్నా. ఆ తర్వాత సినిమా అవకాశాలొచ్చాయి. మా నాన్నది భారీకాయం. వారసత్వంగా నాకూ వచ్చింది. దీంతో తొలి అవకాశం ప్రతినాయకుడిగా తమిళ చిత్రం ఖచట్టం చాయల్‌?లో దక్కింది. ఆ చిత్రంతో వచ్చిన గుర్తింపు వల్ల 75 సినిమాల్లో వెనక్కి తిరిగిచూడకుండా ప్రతినాయకుడిగా కొనసాగా. ఆ తర్వాత మనసు కథానాయకుడి పాత్రలపైకి మళ్లింది. ఒక్క ఛాన్సొస్తే బాగుణ్ను అనిపించింది. అనుకొన్నానో లేదో ఆ అవకాశం కూడా వచ్చింది. కథానాయకుడిగానూ నన్ను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అందుకే 125 సినిమాలు చేయగలిగా. కానీ నటుడిగా మాత్రం పెద్దగా సంతృప్తి లభించలేదు. ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది. మునుపటిలా కథానాయకుడిగా చేసే వయసు కాదు నాది. అందుకే సహాయపాత్రల్లో నటిస్తున్నా. ఈ ప్రయాణం బాగానే ఉంది??.
బహుముఖాదరణ
ఖఖచిరంజీవి చేసిన ఖపసివాడి ప్రాణం?, ఖఎస్‌.పి. పరశురామ్‌?, ఖఆరాధన?, మోహన్‌బాబు నటించిన ఖఅసెంబ్లీ రౌడీ?, ఖఅల్లుడుగారు?, ఖబ్రహ్మ?, ఖయమ్‌.ధర్మరాజు ఎం.ఏ? తెలుగు సినిమాలకి తమిళంలో కథానాయకుడిగా చేశా. నేను తమిళంలో చేసిన పాత్రల్ని తెలుగులో ఎక్కువగా మోహన్‌బాబు వేశారు. పాతిక సినిమాల్లో హాస్యనటుడిగానూ నటించా. తెలుగులో బ్రహ్మానందంగారిలాగా తమిళంలో గౌండమణికి పేరుంది. ఆయనతో కలిసి తమిళంలో నేను కొన్ని కామెడీ పాత్రలు చేశా. అవి ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. హిందీ చిత్రం ఖచెన్నై ఎక్స్‌ప్రెస్‌?తోనూ ప్రేక్షకాదరణని సొంతం చేసుకొన్నా. షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించిన అనుభవాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. బహుభాషల్లో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. కానీ మనసులో నాకు తమిళం తప్ప మిగతా భాషలేవీ రావనే బాధ వుంది. ఇంగ్లిష్‌ కొంచెం కొంచెం మాట్లాడతాను, అర్థం చేసుకుంటా. ధారాళంగా మాత్రం మాట్లాడలేను. ఈ కారణంగానే ఖబాహుబలి? తర్వాత హాలీవుడ్‌ నుంచి అవకాశాలు వచ్చినా వదులుకోవాల్సి వచ్చింది??.
క్యారెక్టర్లకి రియాక్టర్‌
ఖఖసుదీర్ఘ నట ప్రయాణం తర్వాత చేసిన ఖబాహుబలి? నా జీవితాన్నే మార్చేసింది. ఎప్పుడూ రానంత పేరును ఈ చిత్రం తెచ్చిపెట్టింది. నా క్యారెక్టర్లకి ఇదే రియాక్టరనాలి. ఆ సినిమాలో నేను కత్తియుద్ధం బాగా చేయడానికి రాజమౌళి ఒక్కరే కారణం కాదు. మా గురువుగారు పాండ్యరాజన్‌ కూడా. ఆయన వద్ద నేను కత్తియుద్ధంలో నేర్చుకున్న మెళుకువలవల్లే ఖబాహుబలి?లో అవలీలగా చేశా. తెలుగులో చాలా కాలం తర్వాత ఖమిర్చి? సినిమా చేశా. ఖబాహుబలి?తోనే కేరెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయా. మహేష్‌బాబుతో ఖబ్రహ్మోత్సవం?, రామ్‌తో కలిసి చేసిన ఖనేను శైలజ? సినిమాలు కేరెక్టర్‌ ఆర్టిస్టుగా నాకు మంచి పేరు తెచ్చాయి. ఖనేను శైలజ?లో నాయికకి తండ్రిగా చేస్తే, ఇప్పుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో రామ్‌కి తండ్రిగా చేస్తున్నా. ఇది తండ్రీకొడుకుల సంఘర్షణతో సాగే కథ. ఖమిర్చి?లోని తండ్రి పాత్రకి, ఈ కథకీ అసలెలాంటి సంబంధం ఉండదు. ఒక సినిమాకీ మరొక సినిమాకీ సంబంధం వున్న పాత్రల్ని చేయను. ఎంతో కొంత వైవిధ్యం ఉంటేనే చేస్తా. సహాయపాత్రలు యాభై దాకా చేశా. వాటన్నిటిల్లోకి పూర్తిగా భిన్నమైంది ఖబాహుబలి?లోని కట్టప్ప పాత్ర. నాకు సంబంధించినంత వరకు అదొక కోహినూర్‌ వజ్రం. మొన్నీమధ్య ఖదొర? సినిమాలో మరో భిన్నమైన పాత్ర చేశా. అది ఇండియన్‌ దెయ్యం పాత్ర. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చిత్రబృందం తమాషాగా నన్ను కట్టప్పదొర అనేవారు. కట్టప్పగా నాకు పేరుపడింది. ఈ సినిమా వల్ల ఆ కట్టప్ప పాత్ర ప్లస్‌ ఈ దొర పేరును కలిపి ప్రేక్షకులు కట్టప్పదొరగా పిలుస్తారని వారి నమ్మకం. ఈ సినిమాలో మా అబ్బాయి శిబిసత్యరాజ్‌ కథానాయకుడుగా నటించాడు. మంచి పేరొచ్చింది. మా అబ్బాయి పది తమిళ సినిమాల్లో కథానాయకుడిగా చేశాడు. తన కోసం నేనెప్పుడూ రికమెండేషన్‌ చేయను. తన స్వశక్తిపైనే పేరు తెచ్చుకోవాలి. మేమిద్దరం స్నేహితుల్లా మెలగుతాం. నిర్ణయాల్లో మాత్రం తండ్రీకొడుకులుగానే. మా ఆవిడ మహేశ్వరి నాకు బాగా సహకరిస్తుంది. మా అమ్మాయి దివ్య. పెళ్లయింది. నా కుటుంబం అంతా హ్యాపీ??.
మళ్లీ దర్శకుడిగా...
ఖఖసినిమాలతోనే కాదు, టెలివిజన్‌తోనూ నాకు అనుబంధముంది. గాయకుడిగా ఓ తమిళ సినిమాలో ఖసుబ్బయా..సుబ్బయా? అంటూ సుందర్‌.సితో కలిసి గొంతు కలిపా. ఆ తర్వాత ఎందులోనూ పాడలేదు. నిర్మాతగా తొలిగా ఖలీ? అనే చిత్రాన్ని నిర్మించా. కొంత గ్యాప్‌ తర్వాత రెండో సినిమా తీశా. నష్టం రాలేదు కానీ... ఎందుకనో ఇష్టం లేక అలాగే కొనసాగలేకపోయా. నటుడిగానే ప్రేక్షకులకి దగ్గరయ్యా. నాకున్న కొద్దిపాటి అనుభవంతో ఖవిల్లాది విల్లైన్‌? అనే సినిమాకి దర్శకత్వం వహించా. నటుడిగానూ మూడు రకాల పాత్రల్లో కనిపించా. ఈ సినిమా పేరు తెచ్చింది తప్ప డబ్బులు పెద్దగా రాలేదు. దీని తర్వాత దర్శకత్వం జోలికి వెళ్లలేదు. నటుడిగా ఇప్పుడున్న ప్రాభవం తగ్గిపోతే ఆ తర్వాత దర్శకుడి రూపం ఎత్తుతానేమో

,  ,  ,  ,  ,