Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2016 10:50:41
facebook Twitter Googleplus
Photo

మెగాభిమానులకు సరైనోడు అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన కిక్ ఇంకా దిగనే లేదు. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా వరుసగా ఐదుగురు మెగా హీరోలు సినిమాలు స్టార్ట్ చేసేస్తూ.. ఫుల్ జోష్ ఇచ్చేశారు. ఇదే మూమెంట్ లో తన కొత్త మూవీ రిలీజ్ చేసేస్తున్నాడు సాయిధరం తేజ్.

పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన 'సుప్రీమ్' ఇప్పుడు రిలీజ్ కి అన్ని రకాలు రెడీ అయిపోయింది. సెన్సార్ ను కూడా కంప్లీట్ చేసేయడంతో.. విడుదల విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత. సాయిధరం తేజ్ - రాశి ఖన్నా జంటగా రూపొందిన ఈ మూవీకి.. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

సుబ్రమణ్యం ఫర్ సేల్ సక్సెస్ తర్వాత తేజు నుంచి వస్తున్న మూవీ కావడం పటాస్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ కావడంతో.. సుప్రీమ్ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. వీటికి తోడు యూనిట్ కి కూడా సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే సూర్య మూవీ 24 మే 6న విడుదల అవుతున్నా.. దానికి ఒక రోజు ముందే థియేటర్లలోకి తెస్తున్నారు. మే 5న విడుదల కానున్న సుప్రీమ్ తో.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర మెగా మేనల్లుడి మ్యాజిక్ ఖాయం అనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

,  ,  ,  ,  ,