Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Oct-2015 12:58:52
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సినిమాల లెక్క భలేగా ఉంటుంది. ఓ సినిమా ఏదైనా బ్లాక్ బస్టర్ అయితే చాలు.. అదే లైన్ లో బోలెడు సినిమాలు క్యూ కట్టేస్తాయి. అప్పట్లో తొలిప్రేమ - తర్వాత పోకిరి - ఆ తర్వాత మగధీర - రెండేళ్ల క్రితం అత్తారింటికి దారేది.. ఇలా దారి చూపించిన సినిమాలే. మధ్యలో శ్రీనువైట్ల ఢీ మూవీని కూడా లెక్క పెట్టాల్సిందే.

ఫ్రెండ్స్ - చుట్టాలు లాంటివన్నీ అయిపోయాక.. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ఇంటికొచ్చేసింది. ఇంట్లో ఉండే కేరక్టర్లతో సెంటిమెంట్ పండించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు స్టార్ హీరోలు కూడా. రీసెంట్ గా బ్రూస్ లీలో సిస్టర్ సెంటిమెంట్ అంటూ బాగానే ఆయింట్మెంట్ పూశాడు రామ్ చరణ్. తర్వాత ఇతగాడి తమ్ముడి వరుణ్ తేజ్ లెక్క తేలబోతోంది. పూరీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రం లోఫర్. అయితే దీని టైటిల్ "మా అమ్మ మహాలక్ష్మి"అని ఫైనల్ చేశారని గతంలో చెప్పుకున్నాం. అమ్మానాన్నా తమిళమ్మాయికి మించి ఇందులో మదర్ సెంటిమెంట్ ఉంటుందని ఇప్పటికే చెప్పేశాడు పూరీ.

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది యంగ్ టైగర్ గురించే. సుకుమార్ మాస్ యాక్షన్ ఎంటర్టెయినర్ చేస్తున్నానని ముందునుంచీ చెప్పిన ఎన్టీఆర్.. ఇప్పుడా మూవీకి నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. అంటే చెర్రీ సిస్టర్ మెంట్ ని - వరుణ్ తేజ్ మదర్ సెంటిమెంట్ ని చూపించబోతుంటే.. యంగ్ టైగర్ ఫాదర్ సెంటిమెంట్ ని పండిచబోతున్నాడన్న మాట. సెంటిమెంట్ వర్కవుట్ అయితే చాలు.. అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

,  ,  ,  ,