Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Dec-2015 13:12:41
facebook Twitter Googleplus
Photo

పైకి సూపర్ స్టార్ లుగా కనిపించినా వాళ్లు మనుషులే. మనలాంటోళ్లే. ఈ విషయాన్ని తారలు అప్పుడప్పడు తన చేష్టలతో చెప్పేస్తుంటారు. తారలుగా వెలిగిపోయే వారికి సైతం కొందరంటే మహా ఇష్టం ఉంటుంది. తాజాగా అలాంటి ఇష్టాన్ని బాహాటంగా ప్రకటించటమే కాదు.. మరికాస్త అడ్వాన్స్ అయి.. రొమాంటిక్ గా మాట్లాడి వార్తల్లోకి వచ్చారు బాలీవుడ్ బాద్షా షారూక్.

ఈ బాలీవుడ్ స్టార్ కి.. నాటికి.. నేటికీ.. ఎప్పటికి అందాల భామ అయిన ఎవర్ గ్రీన్ రేఖ అంటే విపరీతమైన ప్రేమంట. ఇప్పటికే ఆమె చేతుల మీదుగా పలు అవార్డులు అందుకున్న ఆయన.. తాజాగా ఫిలిం ఫేర్ అవార్డుల ఫంక్షన్ లో షారూక్ కు అవార్డు ఇవ్వటానికి రేఖ స్టేజ్ మీదకు వెళ్లారు. ఈ సందర్భంగా రేఖ మీద తనకున్న ప్రేమను బాహాటంగానే చెప్పుకొచ్చారు షారూక్.

కొన్నేళ్ల క్రితం రేఖ మీద తనకున్న ప్రేమ.. పెళ్లి ప్రతిపాదన చేశానని.. అప్పటి నుంచి రేఖ చేతి నుంచి అవార్డు అందుకునే ప్రతిసారీ తనను ఆమె పెళ్లి చేసుకుంటారేమోనని ఆశిస్తూ ఉంటానని కొంటె వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన రేఖ.. ఈ విషయం నేను గౌరీతో మాట్లాడాలంటూ షారూక్ భార్యను సీన్లోకి తెచ్చారు. ఫ్యామిలీ మ్యాన్ గా ఉండే షారూక్ కు ఏమైందో కానీ.. రొమాంటిక్ పాళ్లు కాస్త పెంచుతూ.. అవును.. మీరిద్దరూ ఎవరు ఏ బెడ్ రూమ్ తీసుకోవాలో మాట్లాకొని నిర్ణయించుకోవాల్సిందేనని వ్యాఖ్యానించటంతో ఒక్కసారి నవ్వులు విరిశాయి. మరికొందరు డోస్ ఎక్కువైందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ గా ఈ మాటలేందని బుగ్గలు నొక్కుకున్నోళ్లు ఉన్నారనుకోండి. ప్రేమను ప్రకటించుకోవటం ఓకే. సరదాకు అయినా.. స్టేజ్ మీద ఈ బెడ్రూం షేరింగ్ మాటలేందో..?

,  ,  ,  ,