Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Oct-2017 12:22:11
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్ల 2.0 ను రోబో కు సీక్వెల్ అనే అనుకుంటున్నాం మొదట్నుంచి. రజినీకాంత్ రోబో అవతారంలో కనిపిస్తుంటే అలా అనుకోకుండా ఎలా ఉంటాం మరి? కానీ ఈ సినిమాలో రజినీకాంత్ రోబోగా కనిపించడం మినహాయిస్తే రోబో కు దీనికి అసలు పోలికే ఉండదంటున్నాడు శంకర్. రోబో కథకు ఇది కొనసాగింపు కాదని శంకర్ చెప్పాడు. ఓ కొత్త కథతో తాను ఈ సినిమా తీసినట్లు వెల్లడించాడు. మరి ఈ సినిమాలో చిట్టి పాత్ర కూడా ఉండదన్నమాటే.

ఐతే రజినీ ఇందులో కూడా శాస్త్రవేత్తగా - రోబోగా కనిపిస్తాడన్నది మాత్రం వాస్తవం. ‘రోబో’లో విలన్ కూడా రజినీయే కాగా.. ‘2.0’లో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నాడు. మరి ఈ పాత్రలతో శంకర్ కథను ఎలా నడిపించాడన్నది ఆసక్తికరం. ఇటీవలే 2.0 త్రీడీ మేకింగ్ కు సంబంధించి చిత్ర బృందం రిలీజ్ చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.

ఈ నెలాఖర్లో దుబాయ్ వేదికగా భారీ ఖర్చుతో ఆడియో వేడుక చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా 2.0 టీజర్ లాంచ్ ఉంటుంది. డిసెంబర్లో చెన్నైలో ట్రైలర్ విడుదల చేస్తారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ గత ఏడాదే ముంబయిలో చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 25న 2.0 ప్రేక్షకుల ముందుకొస్తుంది.

,  ,  ,  ,