Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 11:33:38
facebook Twitter Googleplus
Photo

దక్షిణాదిన మరో వారసుడి అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ విక్రమ్ కొడుకు ధ్రువ్ సినిమాల్లోకి రాబోతున్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. అతను చేసిన షార్ట్ ఫిలిం ?గుడ్ నైట్ చార్లీ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి ఆదరణ పొందుతోంది. చాలామంది ఫిలిం సెటబ్రెటీలు సైతం ఈ షార్ట్ ఫిలిం చూసి విక్రమ్ కొడుకుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విక్రమ్ కూడా చాలా ఫోన్ కాల్స్ అందుకున్నాడట కొడుకు విషయంలో. ఇంకా తెరంగేట్రం చేయకముందే కొడుకు అందరి కళ్లలో పడటంపై విక్రమ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

ఇక ధ్రువ్ గురించి వినిపిస్తున్న తాజా కబురు ఏంటంటే.. సూపర్ స్టార్ డైరెక్టర్ శంకర్ అతడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. విక్రమ్ హీరోగా ?అపరిచితుడు?..?ఐ? సినిమాలు చేశాడు శంకర్. ఈ రెండు సినిమాలకు విక్రమ్ పడ్డ కష్టానికి శంకర్ ముగ్ధుడైపోయాడు. ఆ అభిమానంతోనే విక్రమ్ కొడుకుతో సినిమా చేయడానికి ఓకే అన్నాడట శంకర్. ప్రస్తుతం ధ్రువ్ లండన్లో ఫిలిం యాక్టింగ్ కోర్సులు చేస్తున్నాడు. అవి పూర్తవడానికి ఇంకో ఏడాది సమయం పట్టొచ్చు. ఆ లోపు శంకర్ ఫ్రీ అయితే ఆయనతోనే సినిమా చేసే అవకాశముంది. అదే జరిగితే అతడి అదృష్టమే. మరి ధ్రువ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా లేదో చూడాలి.

,  ,  ,  ,  ,  ,