Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 10:36:29
facebook Twitter Googleplus
Photo

వారి వారి అభిమానుల సంగతి కాసేపు పక్కనపెడితే టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ అనే తారతమ్యాలు ఏమీ లేకుండా దాదాపు అందరి హీరోల మధ్య మంచి సంబందాలే ఉంటుంటాయి. వాటిలో బాలీవుడ్ బాద్ షా - టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ల బందం ఒకటి! గతంలో హైదరాబాద్ లో దిల్ వాలే సినిమా షూటింగ్ సందర్భంగా షారుఖ్.. మహేష్ - నమ్రతలను కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పక్క సెట్లో మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా షారుఖ్ - మహేష్ బాబుకి ఒక రిక్వస్ట్ చేశారు.

సాదారణంగా బాలీవుడ్ స్టార్స్ లో దాదాపు చాలామందికి హైదరబాద్ పై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. దానికి హైదరాబాద్ వాతావరణం ఒక కారణమైతే... బిర్యానీ మరో కారణం. ఇటీవల విడుదలయిన రయీస్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ లో పర్యటించారు షారుఖ్. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీపరిశ్రమతో తనకున్న అనుబంధం గురించి చెబుతున్న క్రమంలో తాను మరోసారి హైదరాబాద్ కు వచ్చినప్పుడు తనను డిన్నర్ కు ఆహ్వానించాలని ప్రిన్స్ మహేశ్ బాబుకు రిక్వస్ట్ చేశాడు.

ఈ సందర్భంగా మీడియాతో మరింతగా ముచ్చటించిన బాద్ షా... టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. తనకు హైదరాబాద్ తోనూ - తెలుగు సినిమా ఇండస్ట్రీతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఏమాత్రం అవకాశం దొరికినా తాను హైదరాబాద్ లో వాలిపోవడానికి రెడీగా ఉంటుంటానని అన్నారు.

,  ,  ,  ,  ,