Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 12:58:42
facebook Twitter Googleplus
Photo

కొత్త కుర్రాడు చంద్రమోహన్ డైరక్షన్లో వచ్చిన సినిమా రాధ. శర్వానంద్ హీరోగా లావణ్య త్రిపాఠి అందాల సాక్షిగా ఈ రొటీన్ కామెడీ సినిమా ఇప్పుడు బాహుబలి టిక్కెట్లు మిస్సయిన వారికి ఏకైక ఆప్షన్ గా మారిపోయింది. అయినాకూడా.. శతమానం భవతి శర్వా కెరియర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ కాబట్టి.. ఇప్పుడు రాధ సినిమా తొలి వారంతపు కలక్షన్లు కూడా దానితో కంపేర్ చూడాల్సి వస్తోంది. ఆలా చూస్తే మాత్రం 2 కోట్లు తక్కువొచ్చింది తెలుసా!!

తొలి వారాంతానికి రాధ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల షేర్.. అలాగే తక్కిన ఏరియాల్లో 60 లక్షల షుమారు కలక్షన్ కలుపుకుని.. మొత్తంగా 5.05+ కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన శతమానం భవతి అప్పట్లో తొలి వీకెండ్ కు గాను 7.15 కోట్లు షేర్ వసూలు చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ 1.5 కోటి వరకు రాబట్టింది. అంటే ఇప్పుడు శర్వానంద్ రాధ కంటెంట్ లో వీక్ అయినా అయ్యుండాలి.. లేదా బాహుబలి ప్రభంజనం కారణంగా భారీ వసూళ్ళను రాబట్టలేదనైనా చెప్పాలి.

ఏదేమైనా కూడా.. శర్వానంద్ ఇప్పుడు మరోసారి శతమానం భవతి తరహాలో 33+ కోట్ల షేర్ ను పూర్తి స్థాయి రన్ లో రాబడతాడా? ఒకవేళ అలా రాబడితే మాత్రం మనోడి పొజిషన్ స్థిరపడినట్లే

,  ,  ,  ,  ,  ,