Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jan-2015 10:52:57
facebook Twitter Googleplus
Photo

స్టార్స్ తో చేస్తేనే కానీ, దర్శకుడిగా తన రేంజ్ పెరగదని భావించాడేమో... ఇన్నాళ్లూ చిన్న హీరోలతోనే సినిమాలు చేసిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తొలిసారిగా ఇప్పుడు ఓ స్టార్ హీరోతో చేయడానికి రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్-శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈమేరకు ఇటీవల శేఖర్ వెళ్లి ఓ స్టోరీ లైన్ చెప్పాడనీ, అది బన్నీకి నచ్చిందనీ గీతా ఆర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దీనిని డెవలప్ చేసే పనిలో శేఖర్ వున్నట్టు సమాచారం. స్టోరీ ఫైనల్ గా ఓకే అయితే, ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కి వెళ్లే అవకాశం వుంది. కాగా, శేఖర్ కమ్ముల ప్రస్తుతం తన 'హ్యాపీడేస్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,