Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2017 11:26:46
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్స్ పర్సన్ ల జీవితగాథతో సినిమాలు తీసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ల జీవితాల్లో ఫేస్ చేసిన ఉద్విగ్నతను వెండితెరపై అద్భుతంగా చూపించే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ గా టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత గాథతో సినిమా తీయబోతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ సైనా పాత్రను చేయనుంది.

సైనా పాత్రను చేయడం కోసం ఇప్పటి నుంచే శ్రద్ధ ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టింది. హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సైనా నెహ్వాల్ ను కలిసి బ్యాడ్మింటన్ ఎలా ఆడాలో తెలుసుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. రాకెట్ పట్టుకోవడం దగ్గర నుంచి కోర్టులో ఎలా కదలాలి.. ఎలా ఆడాలి అన్నది నేర్చుకుంటోంది. సైనా గురువు గోపీచంద్ కూడా ఆమెకు ఈ ఆట నేర్పిస్తానని ప్రామిస్ చేశాడట. శ్రద్ధ కపూర్ శ్రద్ధగా ఈ ఆట నేర్చుకుంటున్న ఫొటోలను సైనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. శ్రద్ధకు బ్యాడ్మింటన్ లో కాస్త పట్టు వచ్చిన వెంటనే ఫిలిం మేకర్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

సైనా సినిమా కోసం కొత్తగా నేర్చుకుంటోంది ఆట ఒక్కటే కాదు.. తెలుగు మాటలు కూడా నేర్చుకుంటోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేయబోతున్న సాహోలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ చేయబోతోంది. ఈ సినిమా కోసం తెలుగు మాట్లాటడం నేర్చుకుంటోంది. సినిమా షూటింగ్ లో అంతా తనతో తెలుగులోనే మాట్లాడమంటూ హీరో ప్రభాస్ తో డీల్ కూడా కుదుర్చుకుంది. ఒకవైపు నోటితో భాష నేర్చుకుంటూ మరోవైపు చేతితో ఆట నేర్చుకుంటోంది.

,  ,  ,  ,  ,