Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 11:59:54
facebook Twitter Googleplus
Photo

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నారు. అక్కడ కొన్ని ఛారిటీ కార్యక్రమాలతో పాటు.. నందమూరి అభిమానులతో తన బర్త్ డే వేడుకలు కూడా జరుపుకోనున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు అని నందమూరి ఫ్యాన్స్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సారి తన బర్త్ డేని సంథింగ్ స్పెషల్ గా నిర్వహించనున్న బాలకృష్ణ.. అదే రోజు తన వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి హీరోయిన్ ని అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. .

బాలయ్య ల్యాండ్ మార్క్ మూవీలో హీరోయిన్ పాత్రకు ఇప్పటికే చాలామందిని పరిశీలించారు. గౌతమిపుత్ర శాతకర్ణికి భార్య పాత్రలో చేసేందుకు నయనతార - అనుష్కలు సహా పలువురిని పరిశీలించారు. అయితే.. వీరిలో ఒక్కరిని కూడా ఫైనలైజ్ చేయడం సాధ్యం కాలేదు. దర్శకుడు క్రిష్ ప్లానింగ్ ప్రకారం బల్క్ డేట్స్ కావాల్సి ఉండగా.. వీరు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణంగా.. అలా వరుసగా డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు.

అందుకే సీనియర్ హీరోయిన్ శ్రియకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడట క్రిష్. ఈ మేరకు బాలయ్యకు చెప్పడం ఆయన్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయని తెలుస్తోంది. శ్రియతో డీల్ ఫైనలైజ్ చేసుకుని అమెరికాలో ఉన్న బాలకృష్ణకు ఆ సమాచారం అందించనుందిట యూనిట్. అప్పుడు తన వందో చిత్రంలో హీరోయిన్ గా శ్రియ పేరును అనౌన్స్ బాలకృష్ణ చేస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

,  ,  ,  ,  ,  ,