Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 09:59:20
facebook Twitter Googleplus
Photo

కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం మూవీ మొదలై చాలా నెలలు అయింది. ఆ మాటకు వస్తే.. షూటింగ్ కంప్లీట్ అయిపోయి కూడా చాలాకాలమే అయింది. ఇంకా ఈ సినిమా విడుదలకు మోక్షం కలగకపోవడంతో చాలానే రూమర్స్ వచ్చాయి కానీ.. త్వరలోనే నక్షత్రంను తెరపైకి తెస్తున్నట్లు కృష్ణ వంశీ చెప్పాడు.

మూవీపై హైప్ మరింతగా పెంచేందుకు ఇందులో ఓ ఐటెం సాంగ్ ను జత చేస్తున్నాడు దర్శకుడు. నిర్మాతలు కూడా ఇందుకు సై అనడంతో ఇప్పటికే ఆ అందాల భామ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ను సంప్రదించారనే టాక్ ఉన్నా.. ఎటువైపు నుంచి ఈ విషయంపై కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు నక్షత్రంలో ఐటెం సాంగ్ చేసేందుకు సౌత్ బ్యూటీ శ్రియా శరణ్ ను ఫైనలైజ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. శ్రియను సంప్రదించడం.. ఈ సాంగ్ లో డ్యాన్స్ కు ఉన్న ఇంపార్టెన్స్ ను వివరించడం.. శ్రియ అయితేనే ఈ ఫాస్ట్ బీట్ ఐటెం సాంగ్ కు న్యాయం చేయగలుగుతుందని చెప్పారట.

కృష్ణవంశీ నుంచి వచ్చిన ఈ ఆఫర్ కు శ్రియ సమ్మతించేసిందనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతం కాల్షీట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉందట ఈ భామ.

,  ,  ,  ,  ,  ,