Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Apr-2016 11:00:28
facebook Twitter Googleplus
Photo

కళ్యాణ్ రామ్ మూవీ పటాస్ లో హీరోయిన్ గా నటించిన శృతి సోధికి.. ఆ మూవీ హిట్ కావడంతో ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ వీటిని సరిగా ఉపయోగించుకోలేక వెనకబడిపోయింది శృతి. ఇప్పుడు పటాస్ డైరెక్టర్ తన రెండో సినిమాగా తెరకెక్కించిన సుప్రీమ్ మూవీలో కూడా.. ఆ భామకు ఆఫర్ ఇచ్చాడు.

మై హూ ట్యాక్సీవాలా అంటూ సాగే పాటలో శృతి సోధి ఐటెం సాంగ్ చేసింది. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తేజుకి పోటీగా డ్యాన్సుల్లో కూడా కుమ్మేసింది శృతి. కాస్ట్యూమ్స్ విషయంలోనూ బాగా పొదుపు పాటిస్తూ.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే తొలి సినిమాతో అరంగేట్రంలోనే హిట్టు కొట్టినా.. ఇలా రెండో మూవీకి ఐటెం భామగా మారిపోవడం అంటే.. ఆలోచించాల్సిన విషయమే. మరి కెరీర్ ని ఇలా ఐటెంగాళ్ గానే కంటిన్యూ చేస్తుందో. లేక ఇకనైనా హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంటుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,